తెలంగాణా ఎన్నికల్లో మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ అయ్యేట్లే కనబడుతోంది. తాజా సమాచారం ప్రకారం మొత్తం 119 సీట్లలో టిఆర్ఎస్ 85 నియోజకవర్గాల్లో లీడ్ లో ఉంది. మహాకూటమి 13 స్ధానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. అది కూడా మహాకూటమి లీడ్ ఎప్పటికప్పుడు తగ్గిపోతోంది. ఇక్కడ విచిత్రమేమిటంటే, కాంగ్రెస్ తరపున పోటీలోకి దిగిన పెద్ద పెద్ద లీడర్లు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, రేవంత్ రెడ్డి లాంటి చాలామంది కూడా వెనకబడిపోయారు.

 

సరే, మొదటి రౌండే కదా అని అనుకోవచ్చు. తర్వాత రౌండ్లలో మహాకూటమి లేదా కాంగ్రెస్ అభ్యర్ధులు పుంజుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ మరో రెండు రౌండ్లు కూడా ఇదే విధంగా లీడ్ లో టిఆర్ఎస్ ఉంటే మహాకూటమి అభ్యర్ధులు పుంజుకోవటం కష్టమే. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం టిఆర్ఎస్ 7 ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్  చేసేట్లే కనబడుతోంది. కాకపోతే మహాకూటమికి ఊరటనిచ్చే అంశం ఏమిటంటే, చాలామంది టిఆర్ఎస్ అభ్యర్ధుల మొదటి రౌండ్ లీడ్లు చాలా తక్కువగానే ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ అభ్యర్ధుల లీడ్లు కేవలం వందల్లో మాత్రమే ఉన్నాయి.

 

వందల్లో వచ్చిన మొదటి రౌండు లీడ్లను మహాకూటమి అభ్యర్ధులు రెండో రౌండ్లో అధిగమించే అవకాశాలు చాలానే ఉన్నాయి. కాకపోతే అదే విధమైన లీడ్లు కంటిన్యు అయితే మాత్రం మహాకూటమికి కష్టమనే అనుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలోనే పోలింగ్ సరళి ఏంటో అర్ధమైపోయింది. ఎందుకంటే, పోస్టల్ బ్యాలెట్లు వేసేది ప్రధానంగా ఉద్యోగులే. ఆ ఉద్యోగులే కెసియార్ కు అనుకూలంగా ఉన్నపుడు రూరల్ ఏరియా ఓటర్లు, అర్బన్ ఓటర్లు ఎలా ఓట్లు వేసుంటారో అన్న విషయం ఊహించటం పెద్ద కష్టమేమీ కాదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: