తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాల్లో కారు జోరు ముందు మ‌హాకూట‌మి చితికిల‌ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన కౌంటింగ్‌లో 9.30 గంట‌ల‌కు ట్రెండ్స్ చూస్తుంటే తొలి రెండు, మూడు రౌండ్ల‌లో కారు జోరుకు బ్రేకుల్లేవు. కాంగ్రెస్, టీడీపీ నుంచి పోటీ చేసిన హేమాహేమీలు వెనుకబడ్డారు. టీడీపీ అడ్డా అని ప్రచారంచేసుకున్న కూకట్‌ప‌ల్లిలో నంద‌మూరి సుహాసిని వెన‌క‌ప‌డ్డారు.

రెండు రౌండ్లు ముగిసేస‌రికి ఆమె 4 వేల ఓట్ల వెన‌కంజ‌లో ఉన్నారు. ఇక హేమాహేమీలు అయిన జానారెడ్డి, డీకే అరుణు, కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ, నామా నాగేశ్వరరావు, రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లు సైతం వెన‌క‌ప‌డ్డారు.

ఉదయం 9.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా 80 స్థానాల్లో టీఆర్ఎస్, 20 స్థానాల‌కు కాస్త అటూ ఇటూగా ఆధిక్యంలో ఉన్నాయి. ఎంఐఎం ఊహించినట్టుగానే ఏడు స్థానాలను సొంతం చేసుకునే దిశగా వెళ్తోంది. బీజేపీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ‌క్త‌ల్‌, వైరాలో ఇండిపెండెంట్లు ఆధిక్యంలో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: