తెలంగాణ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. మహాకూటమి కుదేలైంది. కాంగ్రెస్, టీడీపీ ఒక్కటైనా టీఆర్ఎస్‌ పై ఆధిక్యం సాధించలేకపోయాయి. దాదాపు 13 చోట్ల పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్కచోట ఆధిక్యం సంపాదించింది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవిపై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ సండ్ర వరుసగా రెండు సార్లు ఇప్పుటికే విజయం సాధించారు. ప్రజల్లోనూ ఆయనకు మంచి పేరుంది. దీనికితోడు టీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉన్న స్థానికుడు మట్టా దయానంద్ కు టికెట్ ఇవ్వకుండా పాత అభ్యర్థి పిడమర్తి రవికే ఇవ్వడం కూడా టీఆర్‌ఎస్ ఓటమికి కారణమైంది.

మొత్తానికి తెలుగుదేశం పార్టీకి టీడీపీకి చివరకు సండ్ర వెంకట వీరయ్య మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 15 మంది గెలిచినా చివరకు సండ్ర ఒక్కడే పార్టీలో మిగిలారు. ఈసారి కూడా ఆయన ఒక్కడే తెలంగాణ అసెంబ్లీలో పచ్చ కండువాతో ప్రవేశంచే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: