తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కారు జోరు కనిపిస్తుంది.  తెలంగాణ సెంటిమెంట్ వర్క్ ఔట్ అయ్యిందని అంటున్నారు.  అప్పుడు ఎమ్మెల్యేలుగా డిక్లెర్ కూడా అవుతున్నాయి.  ఇప్పటికే చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని సయ్యద్ షహజాదీ ఓటమి పాలైంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తొలి ఓటమి ఎదురయింది. ఈ ఎన్నికల్లో జగిత్యాల మహాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 

టీఆర్ఎస్ నేత సంజయ్ చేతిలో 60,676 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. కాగా, ఫలితాలు వెలువడకముందే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెనుదిగిగారు. అంతే కాదు తెలంగాణలో మొదటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి జీవన్ రెడ్డికి ఇక్కడ ఎంతో ప్రాధాన్యత ఉండేది.  కానీ ఈ సాని తెలంగాణ సెంటిమెంట్ ముందు దిమ్మతిరిగే షాక్ తగిలింది.

అంతే కాదు నాగార్జున సాగర్ లోనూ కాంగ్రెస్ నేత జానారెడ్డిపై నోముల నర్సింహయ్య వెయ్యి ఓట్ల మెజారిటీతో సాగుతున్నారు. మహాకూటమి తరఫున జీవన్ రెడ్డి విజయం సాధిస్తారని లగడపాటి రాజగోపాల్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇటీవల ఫోన్ చేసిన లగడపాటి ‘మీరు మంత్రి కాబోతున్నారు.. కంగ్రాట్స్’ అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: