తెలంగాణ ఎన్నికల్లో మొదటి ఫలితం విడుదలైంది. పాత‌బ‌స్తీని త‌న కంచుకోట‌గా మార్చుకున్న ఇక్క‌డ తొలి విజ‌యం న‌మోదు చేసింది. చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ గెలుపొందారు. అక్కడ టీఆర్‌ఎస్ నుంచి సీతారామ్‌రెడ్డి బరిలో ఉండగా... కాంగ్రెస్ నుంచి ఈసా బినోబైద్ మిస్త్రీ బరిలో ఉన్నారు. ఇక్కడ మొదటి రౌండ్ నుంచే అక్బరుద్దీన్ ముందంజలోనే ఉన్నారు. ఇక్క‌డ పోలింగ్ త‌క్కువుగా న‌మోదైనా అక్బ‌రుద్దీన్‌కు ఎదురు లేకుండా పోయింది. ఇక తొలి విజేత అక్బ‌రుద్దీన్ అయితే రెండో విజేత జ‌గిత్యాల‌లో సంజ‌య్‌కుమార్‌.


జ‌గిత్యాల‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తొలి నుంచి కూడా ఆయన వెనుకబడే ఉన్నారు. కౌంటింగ్‌లో మరికొన్ని రౌంట్లు ఉండగానే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. జీవన్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌ విజయం సాధించారు. భారీ మెజారిటీతో సంజయ్ విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌కు జగిత్యాలలో 40వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఇక్క‌డ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టి జీవ‌న్‌రెడ్డిని ఓడించారు.
ReplyForward


మరింత సమాచారం తెలుసుకోండి: