తెలంగాణలో కారో జోరు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో జగిత్యాల మహాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.   టీఆర్ఎస్ నేత సంజయ్ చేతిలో 60,676 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. కాగా, ఫలితాలు వెలువడకముందే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెనుదిగిగారు.  ఇక అన్ని వైపుల నుంచి టీఆర్ఎస్ కి వస్తున్న మెజార్టీ చూసి మహాకూటమి నేతలు ఢీలా పడిపోతున్నారు. 

గెలుపు మాదే అంటూ నిన్నటి వరకు ఉపన్యాసాలు ఇచ్చిన మహాకూటమి ఇప్పుడు ఈ వైఫల్యం గురించి సంజాయిషీ చెప్పాలా అన్న ఆలోచనలలో పడింది.  తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం చేరింది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఘనవిజయం సాధించారు.

శేరిలింగంపల్లిలో టీడీపీ నేత, మహాకూటమి అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ పై టీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ 12,250 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంతే కాదు కుటల్ పల్లి మహాకూటమి అభ్యర్థి టీఆర్ఎస్ నేత నందమూరి సుహాసిని ఎదురీదుతున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 8,932 ఓట్ల లీడ్ తో విజయం దిశగా దూసుకుపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: