తెలంగాణాలో ఏకపక్షమైన ఫలితాలు వస్తున్నాయి. ఏ ధైర్యంతో కేసీయార్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్ళారో ఆ నమ్మకాన్ని జనం నిలబెడుతున్నారు. టీయారెస్ కి నాల్గింట మూడొంతుల సీట్లు దక్కబోతున్నాయని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. కేసీయార్ ఒకే ఒక్కడుగా నిలబడి తెలంగాణా రణ సీమలో అజేయంగా నిలుస్తున్న సంగతిని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఇక కేసీయార్ ఒక చరిత్ర స్రుష్టించే దిశగానే సాగుతున్నారని చెప్పాలి.


రికార్డులే :


కేసీయార్ కు రికారుడులు స్రిష్టించడం కొత్త కాదు, గతంలో ఎవరూ సాధించని తెలంగాణాను ఆయన సాధించి చేసి చూపించారు. అలాగే తొలిసారి తెలంగాణాలో అధికారం చేపట్టి తనదైన విజనరీతో దూసుకెళ్ళారు. నాలుగున్నరేళ్ళ తరువాత మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి గెలిచిన వీరుడిగా జనం ముందుకు రాబోతున్నారు. . గతంలో ముందతుకు వెళ్ళిన వారు ఎవరూ గెలిచిన దాఖలాలు లేవు.
దాంతో కేసీయార్ ఆ రికార్డుని సొంతం చేసున్నారు. ఇక ఎంతో మంది జాతీయ నాయకులు వచ్చి కేసీయార్ కి ఎదురొడ్డినా కూడా ఆయన వరందరినీ అడ్డుకుని మరీ గెలిచి నిలిచి సరి కొత్త రికార్డు స్రుష్టించారు. మిత్రపక్షంతో కలుపుకుని కేసీయార్ వందకు వందా సీట్లనుఇ గెలుచుకుని సత్తా చాటుతున్నారు. అదే విధంగా కొత్త రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఒకసారి గెలిచిన పార్టీ మరో మారు గెలిచిన దాఖలాలు లేవు. దాన్ని కూడా బ్రేక్ చేసి కేసీయార్ దూసుకుపోతున్నారు. ఆ విధంగా తెలంగాణాలో సరికొత్త చరిత్రను ఆయన క్రియేట్ చేయగలిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: