తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా సిద్ధిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత హరీశ్ రావు 1,01,297 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  అంతే కాదు ఈయన మరో రికార్డు కూడా సృష్టించారు. దేశంలో అతి చిన్న వయసులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  టీటీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కోరుట్ల, కంటోన్మెంట్, వర్దన్నపేట, జగిత్యాల నియోజకవర్గాల్లో విజయ దుందుభి మోగించింది. 

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి కేరాఫ్‌ అడ్రస్‌ ఆపద్ధర్మ మంత్రి, సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీష్‌ రావు. తాజా ఎన్నికల ఫలితాల్లో సైతం ఆయన మరోసారి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో  93,328 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీ సాధించిన హరీష్‌ రావు ఈ సారి కూడా ఆ రికార్డు బ్రేక్‌ చేసేలా ఉన్నారు.

ప్రజాకూటమి తరఫున బరిలోకి దిగిన భవాని రెడ్డి ఏమాత్రం పోటీనివ్వలేకపోయారు. ఇప్పటికే ఇక్కడి నుంచి ఐదు సార్లు ఘనవిజయం సాధించిన హరీష్‌రావు ఆరోసారి కూడా భారీ ఆధిక్యం సాధించనున్నారు. తాజా ఫలితాల మేరకు టీఆర్ఎస్ 90 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 18, బీజేపీ 2, మజ్లిస్ 4, ఇతరులు ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: