తెలంగాణ శాసనసభ ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి  కలవకుంట్ల చంద్రశేఖరరావుకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా అగ్నిపరీక్ష పెట్టాయి. ప్రజాకూటమిలో ప్రధానభాగస్వామి కాంగ్రెసు పార్టీయే అయినప్పటికీ పోటీ మాత్రం కేసీఆర్ కు, చంద్రబాబుకు మధ్య నువ్వా? నేనా? అన్నట్లు  జరిగినట్లుగానే భావిస్తున్నారు. 
Image result for ap chandrababu rahul gandhi
తెలంగాణాలో మాట నిలబెట్టుకున్న చంద్రబాబు


పలు ఎగ్జిట్-పోల్ సర్వేలు టీఆర్ఎస్ కు మెజారిటీ వస్తుందని తేల్చినప్పటికీ ప్రజాకూటమి మాత్రం తాము గెలుస్తామనే భావన కలిగించింది లగడపాటి రాజగోపాల్ గారి ఆంధ్రా ఆక్టోపస్ - నిండా తప్పుదారి పట్టించింది


1  చంద్రబాబుతో కూటమి కట్టి, ఆయనను ప్రచారంలోకి దింపడం ద్వారా కాంగ్రెసు తమ ప్రయోజనం మాట అటుంచి సర్వ వినాశనం సాధించింది.  కేసిఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించారు. అదే తెలంగాణాలో ప్రధాన పాశుపతం. చంద్రబాబు పెత్తనం తెలంగాణలో ఎందుకనే కేసీఆర్ ఆలోచనను నూరు శాతం ప్రజలు అంగీకరించారనేది తేలింది.  


2  తెలంగాణ ముస్లిం మైనారిటీలు ఏ వైపు ఉన్నారనే విషయం కూడా ఎన్నికల ఫలితాల ద్వారా తేలింది. మజ్లీస్ ను మిత్రపక్షంగా ప్రకటించుకోవడం ద్వారా ముస్లింల మద్దతును టీఆర్ఎస్ నూరు శాతం పొందింది అనే విషయం తేటతెల్లమైంది. లేదంటే, 12 శాతం రిజర్వేషన్ల కల్పనలో కేసీఆర్ విఫలమయ్యారని వారు అనుకుని ఉంటే టీఆర్ఎస్ కు దూరమయ్యే వారు. నిన్న ఎమైఎం అధినేత అసదుద్ధీన్ రాకడ కూడా వారి స్నేహానికి బలం చేకూర్చింది. 


3  2014 ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా అధికారాన్ని చేపట్టింది. దక్షిణ తెలంగాణలో మాత్రం అంతంత మాత్రంగానే సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు అదే ఒరవడి ఉత్తర దక్షిణ తేడా లేకుండా కొనసాగింది. రాష్ట్రం మొత్తం టీఆరెస్ కంచుకోట అయింది. 


4  తెలంగాణా ఏర్పాటుతో ఆంధ్ర సెటిలర్లు అన్న భావన మటుమాయమైన సమయంలో, ఏపి సిఎం చంద్రబాబు నాయుడి ప్రవేశం మళ్ళీ ఇక్కడ ప్రజల పాలమనసుల్లో విష బిందువును కలిపే ప్రయత్నం ధారుణ వైఫల్యం చేకూర్చింది. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య విజయం టిడిపి విజయం కాదు. అది ఆయన ఇండివిడ్యువాలిటీ అని చెప్పొచ్చు. అంతేకాదు తెలంగాణా ప్రజలు చంద్రబాబును, టిడిపిని ఇక విసర్జించినట్లే.  చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా గురివింద నీతులు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు సరిపోవచ్చేమో గాని “ఆ మెరమెచ్చు తత్వాన్ని” తెలంగాణా చస్తే సహించదని …మాయా కూటమిని పరిత్యజిస్తూ తెలిపేశారు. 


5  తెలంగాణ ఓటర్లు వేరే ఆలోచనలకు తావివ్వకుండా స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు కు ఓట్లేశారు. బిజెపి, బిఎల్ఎఫ్, స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యను పొందలేలేక పోయారు. టీఆర్ఎస్ ప్రభంజనం ముందు మహా ప్రజా వృక్షాలు కూలిపోయాయి.  


6 ఈసారి కొంత మంది స్వతంత్రులు గెలుస్తారనే అంచనను లగడపాటి సర్వే మాయాజాలం సృష్టించింది. ఆ స్వతంత్రులు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. 


7  ప్రజాకూటమిలో మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ జరగలేదు టీడీపి ఓట్లు కాంగ్రెసుకు, కాంగ్రెసు ఓట్లు టీడీపికి పడ్డాయా? లేదా? అనే విషయం కంటే వాళ్ళిద్ధరి అపవిత్ర కలయికనే తెలంగాణా వాసులు సమర్ధించలేదని తేలింది.


8 ముఖాముఖి పోటీలు, బహుముఖ పోటీలు అనే ఆలోచనే లేకుండా, చంద్రబాబు తెలంగాణా ప్రవేశం కలవకుంట్ల చంద్రశేఖరరావు కు అధికారాన్నిబంగారు పళ్ళెంలో పెట్టి సమర్పించినట్లైంది. 


9 గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఈసారి కులం ప్రధాన పాత్ర పోషిస్తుందని చంద్రబాబు ప్రభావంతో అనుకున్నాం కాని, ఇక్కడ కుల ప్రాతిపదిక పై ఓటర్లు చీలిపోవటం అనేది మరోసారి  జరగదని ఋజువైంది. ప్రస్తుత ఎన్నికలను వెలమ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోటీగా చెబుతూ,  కమ్మ సామాజిక వర్గం  చేసిన ప్రచారం కులరహిత తెలంగాణా ఎడంకాలితో తన్నేసింది. ఈ ఫలితం అసలు కులం విషయాన్ని ఎవరూ పట్తించుకోలేదు. పట్టించుకోరు కూడా!  



10 చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు వేలుపెడితే మొత్తం దేహానికే కాన్సర్ వచ్చింది. దీంతో చంద్రబాబు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ లో కూడా అగమ్య గోచరం కానుంది. దేశంలో బిజెపి వ్యతిరేఖ పక్ష నిర్మాణంపై దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన వాగ్ధానాలు మరచినందుకు కులవాదాన్ని పచ్చ పత్రికల మద్దతు తో రెచ్చగొట్టి నందుకు రేపు ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న మహాసంగ్రామానికి ముందే ఆయన పతనం నిర్ధారించబడిందని  రాజకీయ పండితులు భావిస్తున్నారు. 


ఇక కేసీఆర్ అగ్ని పునీతగా మారగా,  చంద్రబాబుకు అరిష్టం మొదలైనదని ఎన్నికల అగ్నిపరీక్ష తో పనిలేదని భావిస్తున్నారు.  తాజెడ్డ కోతి వనం అంతా చెరచిందన్నట్లు - టిడిపితో అక్రమసంగమం కాంగ్రెస్ కు సమూల వినాశనమే. ఇక జనవరి నుండి కేసుకేసులు. చంద్రబాబు లోని అవినీతి భయం "నో ఎంట్రీ టూ సిబీఐ" వరకు దారి తీయగా అది అర్ధమైన తెలంగాణా వాసులు కర్రుగాల్చి వాతపెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: