తెలంగాణ రాజకీయాల్లో లేడీ ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న కొండా సురేఖ పరకాలలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికలల్లో ఆమె టీఆర్ఎస్ నుంచి వరంగల్‌ తూర్పు నియోకవర్గం నుంచి 55,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సురేఖకు గత ఎన్నికల్లో కేసీఆర్‌ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లోకి జంప్‌ చేసి ఆ పార్టీ తరపున పరకాలలో పోటీ చేశారు. గత ఎన్నికల్లో పరకాలలో టీడీపీ నుంచి పోటీ చేసిన చల్లా ధర్మారెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసి సురేఖపై తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఎన్నికల హడావిడి ప్రారంభం అయినప్పటి నుంచి పరకాలలో సురేఖ గ్యారెంటీగా గెలుస్తుందని వరంగల్‌ జిల్లా ప్రజలతో పాటు, రాజకీయ మేథావులు, సర్వే సమస్థలు సైతం అంచనా వేశాయి. 


అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తు సురేఖ చల్లా ధర్మారెడ్డిపై భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పటికే చల్లా ధర్మారెడ్డికి 20,000 ఓట్ల భారీ మెజారిటీ వచ్చినట్టు సమాచారం. ఇక ఎన్నికల్లో ఓటమిపాలు అయిన కొండా సురేఖ కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు నుంచి గెలుస్తానన్న దీమాతో ఉన్న సురేఖ తన ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఓటమి అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రలోబాలకు గురై ఓటు వేశారని ఆమె ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై  తీవ్రమైన ప్రజావ్యతిరేఖత ఉందని అయనప్పటికి టీఆర్‌ఎస్‌ విజయం సాధించిందంటే అందుకు కారణం ప్రలోబాలే అని చెప్పారు. 


ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్‌ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన ఆయన తెలంగాణను లక్షలకోట్ల అప్పుల్లో ముంచేసారని విమర్శించారు. డబ్బు, మధ్యం, అధికార దుర్వినియోగంతో మాత్రమే టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిందని ఆమె విమర్శించారు. ఏదేమైనా ఈ లేడీ ఫైర్‌బ్రాండ్‌కు త‌మ సొంత గ‌డ్డ అయిన ప‌ర‌కాల‌లో ఇది ఘోర‌మైన అవ‌మాన‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: