కాంగ్రెస్ లో చేరిన ఫెయిర్ బ్రాండ్లు ఇద్దరూ ఓటమి పాలు అయ్యారు. రేపటి తెలంగాణా సీఎం తానేనని ఢంకా భజాయించి చెప్పిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోడంగల్ లో ఓడిపోయారు. ఇక మరో ఫెయిర్ బ్రాండ్ కొండా సురేఖ కూడా పరకాలలో ఓడిపోయారు. దీంతో టీయారెస్ ప్రభంజనం ఎలా వీచిందో అర్ధం చేసుకోవాలి. నా గెలుపును ఎవరూ ఆపలేరని ధీమాగా చెప్పిన ఈ ఇద్దరు నాయకులూ భారీ మెజారిటీతో ఓడిపోవడం విశేషం.


జానా పరాజయం :

ఇదిలా ఉండగా సీనియర్ నేత జానారెడ్డి కూడా ఈసారి ఒటమిపాలు కావడం విశేషం. నాగార్జునసాగర్లో ఈసారి టీయారెస్ అభ్యర్ధి నోముల నరసయ్య చేతిలో ఆయన దారుణగా ఓడిపోయారు. ఇదే వరసలో కరీం నగర్  జిల్లా జగిత్యాలలో కూడా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఇక్కడ చిత్రమేంటంటే జానారెడ్డి కాబోయే సీఎం అనుకున్నారు. జీవన్ రెడ్డి మంత్రి అవుతారని ఏకంగా లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు.
 ఇక మహిళా నాయకురాలిగా మంచి దూకుడు మీద ఉన్న డీకే అరుణ సైతం గద్వాలో ఓటమి పాలు కావడం విశేషం. ఆమె సైతం ముఖ్యమంత్రి అభ్యర్ధుల రేసులో ఉండడం విశేషం. మొత్తం మీద చూసుకుంటే ఎవరైతే గట్టిగా నోరు చసుకుని టీయారెస్ మీద రంకెలు వేశారో వారంతా దారుణంగా పరాజయం కావడం విశేషం,


మరింత సమాచారం తెలుసుకోండి: