తెలంగాణా ఎన్నికల ఫలితాలు తెలిసిపోయాయి. రాజు ఎవరో తేలిపోయింది. కానీ ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నపుడు అందులో టీడెపీ పాత్ర కూడా తప్పకుండా చెప్పుకుని తీరాలి. మూల సిధ్ధాంతాలను పక్కన పెట్టి మరీ కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలపడం కొంప ముంచింది. అటు టీడీపీకే కాదు, ఇటు కాంగ్రెస్ కి కూడా బాగా దారుణంగా దెబ్బ తీసింది.


సెంటిమెంట్ రగిలింది :


చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పొత్తులతొ మరో మారు తెలంగాణా వైపు చూస్తున్నారన్న భావన అక్కడ జనాల్లో కలిగింది. అలా కలిగేలా టీయారెస్ కూడా తన వంతుగా చెప్పుకొచ్చింది. విపరీతమైన ప్రచారం కూడా చేసింది. చంద్రబాబు కూడా హైదరాబాద్ నేనే అభివ్రుధ్ధి చేశాను అంటూ గొప్పలు చెప్పుకోవడంతో జనాలు కూడా ఇటు తిరిగిపోయారు. ఇక. కేసీయార్ సైతం తెలివిగా ప్రచారం మొత్తాన్ని బాబు వైపే మళ్ళించడంతో సహజంగానే సెంటిమెంట్ రగులుకుంది. అది చివరకు చేటు తెచ్చింది.


కాంగ్రెస్ ఓటు అటే :


ఇక కాంగ్రెస్‌ మద్దతుదారులుగా ఉన్నవారు కూడా… చంద్రబాబు పుణ్యమా అని టిఆర్‌ఎస్‌ వైపు వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ టిడిపితో కలిసిన తరువాత…. అప్పటిదాకా కాంగ్రెస్‌కు ఓటేయాలనుకున్నవారు కూడా ముందూవెనుకా ఆలోచించకుండా టిఆర్‌ఎస్‌కు ఓట్లేశారు. ఏ విధంగా చూసుకున్నా…. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదుగానీ…. తెలుగుదేశం వ్యవహరించిన తీరు మాత్రం ప్రజలు ఆమోదించేలా లేదు. 
అందుకే ఇంతటి ఘోర పరాజయాన్ని పార్టీగానూ, కూటమిగానూ మూటగట్టుకుంది. తెలంగాణలో జై తెలంగాణ అంటూ చంద్రబాబు మొదలుపెట్టిన ప్రచారానికి ఫలితంగా ఇలా చుక్కలు కనిపించాయి. మొత్తమ్మీద ఇక్కడి ఫలితాలు... వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరగబోయే ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి... ఏం జరుగుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: