ఓడిపోవడంలో బాధ ఎలా ఉన్నా ప్రత్యర్ధుల మాటలు ఈటెల్లా పొడిచేస్తుంటే తట్టుకోవడం మాత్రం చాలా కష్టమే. అసలే చంద్రబాబునాయుడు తెలంగాణాలో ఓటమి బాదలో ఉంటే ఆ పార్టీ నాయకులు సెటైర్లు ఓ రేంజిలో నొప్పి పెడుతున్నాయట. తోడికోడలు నవ్వినందుకు బాధ అని టీడీపీ తమ్ముళ్ళు ఇపుడు తెగ నొచ్చుకుంటున్నారు.


ప్రతి సీటుకూ 28 కోట్లు :


ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి అసెంబ్లీ సీటుకు 28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి, కానీ చంద్రబాబు 28 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కూకట్‌పల్లిలో వంద కోట్లు వెదజల్లారు. ఫలితాన్ని ఒక్క శాతం కూడా మార్చలేక పోయారు. బాబూ యూ ఆర్ అవుట్.’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 
పవిత్ర కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన పత్రికలు టీడీపీ కరపత్రాలుగా మారాయి. తెలంగాణ ప్రజానీకం తిరుగులేని తీర్పుతో సైకిల్‌కు ముందు చక్రం ఊడిపోయింది. నాయుడుబాబుకు చావుతప్పి కన్నులొట్టబోయింది. సైకిల్‌ వెనుక చక్రం కూడా పీకి చంద్రబాబు పీడను ఎంత త్వరగా ఒదిలించుకోవాలా అని ఆంధ్ర ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నార’ని ట్వీట్‌ చేశారు.


అది అనైతిక పొత్తు :


కాంగ్రెస్ – టీడీపీ అనైతిక పొత్తును తెలంగాణ ప్రజలు తిరస్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ రొజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు డబ్బులకు ఆశపడి ఆయనతో పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు.  చంద్రబాబుతో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ నిండా మునిగిందని అన్నారు. చంద్రబాబుతో పొత్తు లేకుంటే కాంగ్రెస్ కి విజయావకాశాలు ఉండేవన్నారు. చంద్రబాబు, లగడపాటి కలిసి ఆడిన డ్రామాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: