ఎక్కడైతే జనం బాగా వచ్చారనుకున్నారో అక్కడే ఓటమి ఎదురైంది. నిజానికి జనాలు రాలేదు రప్పించారన్న ఆరోపణలు ఉన్నాయనుకోడి. నేను ఇంత చేశాను, అంత చేశాను అన్ని చెప్పుకున్నా జనం ఆదరించలేదు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అంటూ లెక్చర్లు దంచినా కూడా స్పందన లేదు. ఆయన సచివాలయానికే రాడు అంతూ దెప్పిపొడించినా, ఆయన లక్షల కోట్ల అప్పులు చేశారని నిందించినా కేసీయారే కావాలానుకున్నారు.


బాబు అడుగుతో అంతే :


హైదరాబాద్ లో కూకట్ పల్లి, ఉప్పల్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మలక్ పేట్ నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోల ద్వారా ప్రజాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఈ అన్ని  స్థానాల్లోనూ ప్రజాకూటమి అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఖమ్మంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్నారు. చరిత్రాత్మకంగా చెప్పుకున్న ఈ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు.


రెందే దక్కాయి :


ప్రజాకూటమి ఏర్పాటుతో పాటు టిక్కెట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అనేక అంశాల్లో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. ఇక తెలంగాణలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే, ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. ఆయన ప్రచారం చేసిన స్థానాల్లో కేవలం సత్తుపల్లి, అశ్వరావుపేట మినహా అన్ని స్థానాల్లో ప్రజాకూటమి అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఇదంతా చూస్తూంటే కేసీయార్ పట్ల ఎంతటి ఆదరణ ఉందో అంతకు మించి టీడీపీ పట్ల జనాల్లో అపనమ్మకం ఉందని ఈ ఫలితాల శరళీని బట్టి తేలుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: