తెలంగాణలో కారు దూసుకుపోయింది.. 86 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో అనేక ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి 51 వేలు పైచిలుకు మెజారిటీతో మళ్లీ తన స్థానం నిలబెట్టుకున్నారు. ఆయన మేనల్లుడు సిద్దిపేటలో లక్షా 18 వేల పైచిలుకు మెజారిటీతో దేశంలోనే రికార్డు నెలకొల్పారు. ఇక కేసీఆర్ తనయుడు కేటీఆర్ సిరిసిల్లలోనూ భారీ మెజారిటీ సంపాదించారు. 88, 815 ఓట్ల మెజారిటీతో సిరిసిల్ల స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

Related image

ఇక ఆ పార్టీ నుంచి అనూహ్యంగా నలుగురు మంత్రులు పరాజయం పాలవడం ఆశ్చర్యం కలిగించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరులో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గెలిచారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్హాపూర్ లో ఓడిపోయారు. ఇంకో మంత్రి చందూలాల్ ములుగు నుంచి ఓడిపోయారు. మరో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తాండూరులో ఓటమిపాలయ్యారు. వీరితో పాటు స్పీకర్ మధుసూదనాచారి కూడా ఓడిపోయారు.

Image result for CONGRESS symbol

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కారు జోరుకు ఈ పార్టీకి చెందిన అనేక మంది అగ్రనేతలు మట్టికరిచారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో సీనియర్ నేత భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి వంటి కొద్దిమంత్రి నేతలు మాత్రమే గెలుపొందారు.

కాంగ్రెస్ లో అగ్రనేతలుగా పేరున్న జానారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓడిపోయారు. వీరితో పాటు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, డీకే అరుణ, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి, కొండా సురేఖ, షబ్బీర్ అలీ, సునీతా లక్ష్మారెడ్డి వంటి నేతలు కూడా కారు హోరులో కొట్టుకుపోయారు.

Image result for BJP SYMBOL

ఇక బీజేపీ అగ్రనేతలు కూడా టీఆర్‌ఎస్ ధాటికి ఓటమిబాట పట్టారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి ఓడిపోయారు. మరో అగ్రనేత లక్ష్మణ్ కూడా అంబర్ పేట నుంచి ఓడిపోయారు. ఆందోల్‌ పోటీ చేసిన సినీనటుడు బాబూ మోహన్ కూడా ఓడిపోయారు. ఆ పార్టీ గోషామహల్ లో విజయం సాధించింది.


Image result for TDP SYMBOL

ఇక టీడీపీ విషయానికి వస్తే.. అందరి దృష్టీ ఆకర్షించిన కూకట్ పల్లి నుంచి నందమూరి సుహాసిని ఓటమి చెందారు. ఈ పార్టీ కేవలం ఖమ్మం జిల్లాకు పరిమితమైంది. ఆ జిల్లాలోని సత్తుపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 17 వేల పైచిలుకు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ పక్కనే ఉన్న అశ్వరావుపేట నుంచి మచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఇక టీడీపీ నుంచి వేరెవరూ గెలవలేదు.

Related image

ఎంఐఎం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నుంచి.. అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి గెలుపొందారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి హుస్నాబాద్ లో పోటీ చేసి ఓడిపోయారు. 8 స్థానాలకు పైగా పోటీ చేసిన తెలంగాణ జనసమితి ఎక్కడా తన ఉనికి చాటుకోలేకపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: