రంగారావు తుమ్మితే సుబ్బారావు ఇల్లు కూలినట్టు చంద్రబాబు పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారయ్యింది. ఉన్నది పోయె…ఉంచుకొన్నది పోయె అన్నట్లు బాబు ఏదో ఆశించి తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టి కూటమి ఏర్పాటు చేసి పోటీ చేస్తే ఇప్పుడు అది ఏపీలో అతని సీటుకే ఎసరు పెట్టింది. ఏపీలో రానున్న ఎన్నికల్లో తెలంగాణ లో టి.డి.పి ఓటమి ప్రభావం బలంగా ఉండబోతోంది అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ముందు టీడీపీలోకి కీలక నేతగా వ్యవహరిస్తూ బాబు యూ టర్న్ రాజకీయాలు నచ్చక టిఆర్ఎస్ కు తరలి పోయిన ఈయన బాబు గురించి భవిష్యవాణి చెప్పారు. 
Related image

తెలంగాణలో తనతో మైత్రికి ససేమిరా అనడమే టీఆర్ ఎస్ చేసిన పాపంగా పరిగణించిన చంద్రబాబు... టీఆర్ ఎస్ గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదిపారు. టీడీపీ ఆవిర్భావానికి ఏ పార్టీ అయితే కారణమైందో... అదే పార్టీ చంకన చేరిపోయిన చంద్రబాబు... నిజంగానే తెలుగు జాతిని అవమానపరచిన కాంగ్రెస్ పార్టీ కాళ్ల దగ్గర టీడీపీ మోకరిల్లేలా చేశారు. తమ తో దోస్తీ చేయని ఏ ఒక్కరూ తమ వారు కారు అన్న చంద్రబాబు వైఖరే ఆఖరికి తెలంగాణ ప్రజల్లో కసిని పెంచింది అన్నారు. 
Related image

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్‌కు మారిన నేతలను అనర్హత వే టు వేయాల్సి ఉన్నా కూడా వేయకుండా ఉన్న విషయం పై బాబు ప్రస్తావిస్తూ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దించాలి అన్న విషయాన్ని తలసాని గుర్తు చేశారు. ఏపీలో వైసీపీ టికెట్లపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు... ముందుగా వారితో రాజీనామాలు చేయించి తెలంగాణ గురించి మాట్లాడాలని హితవు పలికారు. బాబు ప్రచారంలో ఇంటింటికీ ఒక ఉద్యోగం మూడు ఎకరాల పొలం వంటి విషయాలను ప్రస్తావించిన తీరును చూస్తే తనకు నవ్వు వచ్చింది అని అన్నారు.
Image result for chandrababu thalasani
అసలు ఏపీలో ఈయన ఏ మాత్రం తన హామీలను నిలబెట్టుకున్నాడు అని ప్రశ్నించారు. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? అన్న చందంగా బంగారు తెలంగాణలో వేలు పెట్టి కెలికేందుకు యత్నించిన చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని తలసాని తనదైన సెటైర్ విసిరారు. ఇదిలా ఉండగా సనత్ నగర్ నుండి బరిలోకి దిగిన తలసాని భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇంకా నేను చెప్పినట్లు ఏపీలో కూడా బాబు పరిస్థితి తారుమారు అవుతుందో లేదో వేచి చూడాల్సిందే..!


మరింత సమాచారం తెలుసుకోండి: