దేశంలో కొత్త రాజకీయ ఫ్రంట్ తొందరలోనే ఏర్పాటు అవుతుందని టీయారెస్ అధినేత కేసీయార్ ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ త్వరలోనే మొదలుపెడతామని ఆయన చెప్పారు. తెలంగాణాలో విజయపతాక ఎగురవేసిన సందర్భంగా కేసీయార్ మీడియాతో ఈ రోజు మాట్లాడారు. ఈ దేశ రాజకీయ మౌలిక స్వరూప స్వభావాలు మారాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆయన అన్నారు.


ప్రజలే నాయకులు:


తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కి దేశ ప్రజలే నాయకులుగా ఉంటారని కేసీయార్ స్పష్టం చేశారు. ఈ దేశానికి కాంగ్రెస్, బీజేపీ ముక్తి కావాలని కేసీయార్ చెప్పారు. ఆ రెండు పార్టీల తలబిరుసుతనానికి వ్యతిరేకంగానే ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ దేశంలో ప్రధనమైన అంశాలన్నీ కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రం స్వేచ్చగా తనకు వీలైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.


దేశంలో అయోమయం :


రాజకీయంగా దేశంలో ఓ అనిశ్చితి ఉంది.. ఇది మారాలి. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చాం. తమకు ప్రజలే బాస్‌లు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తానని చెప్పారు. కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు.


కీలక పాత్ర :


రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. చైతన్యవంతమైన గడ్డ కాబట్టి దేశ రాజకీయాల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలి. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు నాయకులు కాదు. ఇండియాలో మెచ్చురిటీ రావాలి. ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల పెద్దలు వచ్చి ప్రచారం చేశారు. అంతిమ నిర్ణయం ప్రజలు ఇచ్చారని కేసీయార్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: