మరో అయిదేళ్ల అధికారానికి జనాదేశం పొందిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఈసారి చాలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని నిర్ణయించి
నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకించి ఆయన మంత్రి వర్గం కూర్పును జాగ్రత్తగా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణా  బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిన కేసీయార్ ఇకపై కనీస విమర్శ కూడా లేకుండా పాలన చేయాలనుకుంటున్నరని అంటున్నారు.


ఆ వర్గాలకు పెద్ద పీట :


కేసీయార్ పై ఉన్న విమర్శల్లో ఒకటి మహిళలను ఆయన తన క్యాబినెట్లోకి తీసుకోలేదని.నాలుగున్నరేళ్ళ పాలనలో కేసీయార్ మంత్రివర్గంలో మహిళ లేదన్నది విధితమే.  అలాగే దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానని ఇవ్వలేదని మరో విమర్శ. ఇక విధ్యార్ధి లోకం, యువత కొంత అసంత్రుప్తిగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ విరుగుడు అన్నట్లుగా కేసీయార్ ఈసారి మంత్రి వర్గంలో ఆయా వర్గాలకు పెద్ద పీట వేస్తారని అంటున్నారు. 


బాల్క సుమన్ కి చాన్స్:


విధ్యార్హ్ది పోరాటాల నుంచి వచ్చిన బాల్క సుమన్ ని ఈసారి తన మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కేసీయార్ నిర్ణయించారని అంటున్నారు. ఆయన ఎంపీ గా ఉంటూ తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే యువతకు కూడా పెద్ద పీట వేయాలనుకుంటున్నారుట. ఇక దళితులు, మైనారిటీలకు మరిత ప్రాధాన్యం ఇచ్చేలా మంత్రి వర్గం కూర్పు ఉంటుందని అంటున్నారు. 
కీలకమైన శాఖలను అందరికీ ఇవ్వడం, అన్ని వర్గాల సమాహారంగా మంత్రి వర్గాన్ని నిర్మించడం కోసం కేసీయార్ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా టీయారెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో  పార్టీ శాననసభా పక్ష సమావేశం రేపు (బుధవారం) జరగబొతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: