ఫెడరల్ ఫ్రంట్ అంటూ టీయారెస్ అధినేత కేసీయార్ తాజాగా మళ్ళీ ప్రకటించిన నేపధ్యంలో దేశ రాజకీయాల్లో ఆ అంశం చర్చకు తావు ఇస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ముక్తి భారత్ అంటూ కేసీయార్ పిలుపు ఇవ్వడం కూడా ఆసక్తికరంగా ఉంది. ఆ రెండు జాతీయ పార్టీలు లేకుండా దేశంలో కొత్త రాజకీయ ఫ్రంట్ ని నిర్మిస్తామని కేసీయార్ అంటున్నారు. అందులో ఎవరెవరు ఉంటారన్నదానిపై వూహాగానాలు పలు రకాలుగా ఉన్నాయి


ఏపీ సంగతేంటి :


కేసీయార్ ఫ్రంట్ కి దేశంలోని పార్టీల మద్దతు పక్కన పెడితే సాటి తెలుగురాష్ట్రం ఏపీ సంగతేంటన్నది ఇపుడు ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఏపీలో చంద్రబాబును కేసీయార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా బాబు ఇపుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల బాబుని కలుపుకునిపోవడం అన్న ప్రశ్నే లేదు మరి అక్కడ వున్నవి వైసీపీ, జనసేన వంటి పార్టీలు. ఈ పార్టీల అధినేతలు ఇద్దరూ కేసీయార్ అంటే సానుకూలంగా ఉన్నవారే. తెలంగాణా ఎన్నికల్లో వారి పార్టీలు కూడా పోటీ చేయలేదు, పైగా మద్దతు పరోక్షంగా టీయారెస్ కూటమికి దక్కిందన్న మాట కూడా వినిపించింది.


ఇద్దరూ గ్రీట్ చేశారు :


అదే విధంగా జగన్, పవన్ ఇద్దరూ కూడా కేసీయార్ ఘన విజయాన్ని అభినందిస్తూ గ్రీట్ కూడా చేశారు. పవన్ అయితే ఒక లేఖ రూపంలో కూడా తన అభినందనలు పూర్తిగా తెలియచేశారు. ఇక జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపినా అయన ఆముదాలవలస మీటింగ్ చూస్తే టీయారెస్ విజయం పట్ల ఎంతటి ఆనందంగా ఉన్నారో అర్ధమవుతోంది. 
ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరిలో ఎవరిని కేసీయార్ ఫ్రంట్ లో చేర్చుకుంటారన్నది చర్చగా ఉంది. అయితే ఒక విశ్లేషణ ప్రకారం రెండు పార్టీలు కూడా కేసీయార్ ఫ్రంట్ లో ఉంటాయని అంటున్నారు పైగా రేపటి ఏపీ ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరినీ కలిపే బాధ్యత కూడా తీసుకుంటారని అంటున్నారు. చూడాలి టీయారెస్ విజయంతో ఏపీ రాజకీయాల్లో ఎన్ని మార్పులు వస్తాయో.



మరింత సమాచారం తెలుసుకోండి: