ప్రజాకూటమి పేరుతో తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చేసారు. ముందుస్తుగా ఎన్నికలకు వెళ్లి 119 సీట్లుకు 88 సీట్లు గెలుచుకుని విజయానందంలో ఉన్న కేసీఆర్.. గెలిచిన వెంటనే చంద్రబాబుపై యుద్ధం ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీ రాజకీయాల్లో కలుగజేసుకోవాలని తమను కోరుతున్నారని చంద్రశేఖర్ రావు అంటున్నారు.

Related image


తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. " తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబు అంటుంటాడు... తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్‌కు మాత్రం ఉండొద్దా? తెలుగు ప్రజలు బాగుండాలని వంద శాతం కోరుకుంటున్నా. ఉదయం నుంచి లక్ష పైనే ఏపీ నుంచి ఫోన్లు వచ్చాయి. వాట్సాస్ ద్వారా మేసేజ్‌లు వచ్చాయి..” అన్నారు.

Image result for kcr vs chandrababu

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు తనకో గిఫ్ట్ ఇచ్చారని.. దాన్నితిరిగి ఇవ్వకపోతే బావుండంటూ సెటైర్లు పేల్చారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు తకనిచ్చిన గిఫ్ట్‌కు.. తాను ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుంటే బాగుండదు. చంద్రబాబు ఇక్కడ చేసినందుకు నేనూ అక్కడ చేయాలి కదా. దాని ఫలితం ఎలా ఉండబోతుందో చంద్రబాబు త్వరలోనే చూస్తారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణోళ్లు సంస్కారహీనులు అని మళ్లీ అంటారు అంటూ మెత్తగానే.. నవ్వుతూనే వార్ అనౌన్స్ చేశారు.

Related image


కేసీఆర్ మాటలను బట్టి చూస్తే.. ఆంధ్రా ఎన్నికల్లో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ కూడా తమ పుట్టలోపాలు పెట్టిన వారిని తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని ఎన్నికల ప్రచార సమయంలోనే తేల్చి చెప్పారు. ఇప్పటికే ఆంధ్రాలో టీడీపీ- వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు టీఆర్‌ఎస్ కూడా అక్కడి ప్రతిపక్షానికి అండదండలందిస్తే చంద్రబాబుకు గడ్డు పరిస్థితే ఏర్పడే ప్రమాదం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: