తెలంగాణలో బంపర్ మెజారిటీతో మళ్లీ అధికారం చేపట్టిన కేసీఆర్.. ఆ విజయానందంలో మునిగితేలుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై సెటైర్లు పేలుస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణలో తనను ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన చంద్రబాబు తీరుపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబుదంతా డొల్ల రాజకీయమంటూ విమర్శలు గుప్పించారు.

Kcr-and-chandrababu


నీతి ఆయోగ్ సమావేశాల్లో చంద్రబాబు చాలా వెకిలిగా ప్రవర్తించేవారంటూ గుర్తు చేసుకున్నారు. గతంలో ముఖ్యమంత్రుల సమావేశాల్లో చంద్రబాబును మోడీని ఆకాశానికెత్తేసేవారని వివరించారు. మోడీని ప్రసన్నం చేసుకునేందుకు లేని పోని పొగడ్తలతో బొక్కబోర్లాపడ్డారని కేసీఆర్ అన్నారు. ఒకానొక దశలో.. మోడీ వంటి ప్రధాని ఈ దేశానికి వరమని చంద్రబాబు పొగిడారని... అదే సమయంలో అసలు ఓ ముఖ్యమంత్రి ప్రధాని కావడం వల్లే ఇంత బాగా పనిచేస్తున్నారని చంద్రబాబు పొగిడారని కేసీఆర్ గుర్తు చేశారు.

Related image


చంద్రబాబు మాటలకు ఆ సమావేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా అవాక్కయ్యారని కేసీఆర్ ఆనాటి మీటింగ్ విశేషాలు వివరించారు. తన పక్కన ఉన్న అఖిలేష్ వంటి వారు.. చంద్రబాబును చూసి నవ్వుకున్నారన్నారు.. చంద్రబాబు ఏంటి మరీ ఇంత సిల్లీ గా ఇలా మాట్లాడతాడు.. ఎంత మంది ముఖ్యమంత్రులు గతంలో ప్రధానులు కాలేదు అని తనతో అన్నారని కేసీఆర్ చెప్పారు.

Image result for chandrababu MODI CHEERS


చరణ్ సింగ్, వీపీ సింగ్ సహా ఎందరో ముఖ్యమంత్రులు ప్రధానులు అయ్యారని.. అంతెందుకు మన తెలుగు వారు పీవీ నరసింహారావు కూడా అంతకు ముందు ఏపీకి సీఎంగా పని చేయలేదా.. ఆ విషయం కూడా తెలియకుండా మోడీని పొగిడేందుకు చంద్రబాబు తహతహలాడారంటూ చంద్రబాబు పరువు తీసేశారు కేసీఆర్. అంతే కాదు.. మోడీ పాయిఖానాకు పోయినా వాసన రాదని చంద్రబాబు అంటారని వ్యంగ్యోక్తులు విసిరారు. అంతేకాదు.. చంద్రబాబు సంగతి విజయవాడ వచ్చి చెబుతానన్నారు కేసీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: