తెలంగాణ గులాబీ పార్టీ మరోసారి అధికార పీఠం హస్తగతం చేసుకుంది. ముందస్తుకు వెళితే అధికారం కోల్పోవడమే అన్న చరిత్రను కేసీఆర్ తిరగరాశారు. గతం కంటే ఏకంగా పాతిక వరకూ సీట్లు అదనంగా తెచ్చుకుని సత్తా చాటారు. కారు జోరులో మహా మహ నేతలే కొట్టుకుపోయారు. అయితే కేసీఆర్ గెలుపు ప్రధానంగా ముగ్గురి గుండెళ్లో రైళ్లు పరుగెట్టిస్తోందికేసీఆర్ గెలుపుతో ఆత్మరక్షణలో పడినవారిలో ఏపీ సీఎం చంద్రబాబు ఉంటారు.

Image result for KCR FIRES chandrababu


ఆయన పనిగట్టుకుని తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. అందుకు కాంగ్రెస్‌ తో సైతం చేతులు కలిపారు. ప్రజాకూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించి.. కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా కేసీఆర్ ను ఓడించేందుకు విఫలయత్నం చేశారుఎన్నికల సమయంలనే ఇందుకు బదులు తీర్చుకుంటామని కేటీఆర్ చెప్పారు.. రిటర్న్‌గిఫ్ట్ ఇచ్చి తీరుతానని తాజాగా కేసీఆర్ కూడా తేల్చి చెప్పారు. వచ్చే ఆంధ్రా ఎన్నికల్లో కేసీఆర్ జగన్‌కు సపోర్ట్ గా ఉంటారని దీనితో రూఢీ అయ్యింది. అదొక్కటే కాకుండా.. చంద్రబాబు మెడపై ఓటుకు నోటు కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది.

Image result for KCR FIRES revanth


ఇక చంద్రబాబుతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గుండెల్లోనూ పరిగెడుతున్నాయి. ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచారం సమయంలోనూ.. అంతకుముందు కూడా ఓరే కేసీఆర్.. అరే కేటీఆర్ అంటూ ఏకవచనంతో సవాళ్లు విసిరారు. చూసుకుందాం.. దమ్ముంటే.. అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోయారు. ఇప్పుడు ఆయన మెడపైనా ఓటుకు నోటు కత్తి వేలాడుతూనే ఉంది. అందులోనూ ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడంతో ఆయన పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

Related image

చంద్రబాబు, రేవంత్ తో పాటు కేసీఆర్ గెలుపు పట్ల భయపడుతున్న వ్యక్తుల్లో దమ్మున్న ఛానల్, పత్రిక ఎండీ కూడా ఉంటారు. గతంలోనే కేసీఆర్ ఆగ్రహం చవిచూసి అప్రకటిత నిషేధం ఎదుర్కొన్న ఆయన మీడియా.. ఆ తర్వాత కేసీఆర్ భజనలో మునిగింది. ఎన్నికల ముందు వరకూ ఈయన కేసీఆర్‌తో సఖ్యతగానే ఉన్నారు. చంద్రబాబు ప్రజాకూటమి ఏర్పాటు చేయగానే రూటు మార్చేశారు. ఈయనకు కూడా కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో వార్నింగ్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ ముగ్గురి విషయంలో ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: