కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ముఖ్య మంత్రి స్థాయి నేత తన నియోజక వర్గం లో ఓడిపోవడం ఇప్పడూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది . తెరాస పక్క వ్యహం తో చాప కింద నీరు లా తన పని కానిచ్చేసిందని  తెలుస్తుంది . ఎన్నికలకు ముందు హల్ చల్ చేసిన ఈ నాయకుడు రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికలలో బొక్కబోర్ల పడ్డారు. మహాకూటమి అభ్యర్దులను తానే గెలిపించాల్సిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దీని వెనుక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ పార్టీ నేత హరీష్ రావుల పగడ్బంది వ్యూహం ఉంది.

Image result for revanth reddy

తమ గెలుపు కంటే రేవంత్ రెడ్డి ఓటమే ప్రధానంగా హరీష్ రావు కొడంగల్ లో పనిచేసారు. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులను తమ వైపు తిప్పుకోవడంలో హరీష్ రావు విజయం సాధించారు. ఎక్కడా ఎటువంటి లోపాలకు తావివ్వకుండా వ్యూహలను రూపొందించారు.రేవంత్ రెడ్డి ఓటమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పావులు కదిపారు. ఎక్కడిక్కడ తన వ్యూహాలను హారీష్ రావు చేత అమలు చేయించారు.

Image result for revanth reddy

కొడంగల్ నియోజకవర్గంలో వ్యూహాలను మారుస్తూ.. కొత్త కొత్త ఎత్తుగడలను రచిస్తూ రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసారు. రేవంత్ రెడ్డికూడా తన విజయం ఖయమనే దీమాతో నియోజకవర్గాన్ని తన తమ్ముళ్లకు అప్పగించారు. ఆయన ముఖ్య అనుచరులు తెలంగాణ రాష్ట్ర సమితితో చేతులు కలిపారు. ఇక కొడంగల్ ఓటర్లు కూడా రెండు సార్లు గెలిపించినా రేవంత్ రెడ్డిని కాదని అధికార పార్టీకి పట్టం కట్టారు. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి దూకూడు ఆయన ఓటమికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: