పంచ పాండవులు  కలిస్తే దిగ్విజయం తానంతట తానే కదలివస్తుంది. కారణం  ప్రజాస్వామ్యంలో అంతా నేనే అంతా నాదే  "నేను వినా మీ విజయం, మీ జీవితం దయనీయం" అనే తత్వం విజయాలను యివ్వదు. పరిపాలనకు శోభనివ్వదు.


 Image result for kcr ktr kavita harish


ధర్మజుడు ధర్మ స్వరూపం.

భీముడు ధైహిక సామర్ధ్య చిహ్నం.

అర్జునుడు నైపుణ్య నిరతుడు దైవ విదేయుడు స్నేహితుడు.

నకులుడు మాసిక దైహిక ఆరోగ్య జ్ఞాని.

సహదేవుడు బుద్ధిశాలి.


Image result for pancha pandavulu images

ఐదుగురు ఐదు సుగుణాల గనులు. అందరు ఒక విశాల ప్రయోజన సాధనకు ఉపక్రమించి కలిసిన  ప్రతిసారీ ఆ దేవదేవుడు శ్రీకృష్ణభగవానుని అనుగ్రహం లభించింది. ఇక్కడ ధర్మం, సుగుణం, విశ్వాసం, సంకల్పం, నియంత్రణలు విజయలను అందించాయి. వారి ఐఖ్యతే వారి బలం. బలహీనత కూడా.


కాకపోతే కార్యవిభజన చేసి, కార్యసాధనకు నైపుణ్యం జోడించి ఉపక్రమించటం వారికి బలమైంది. మనసుల్లో విభేదాలు తలెత్తి నప్పుడు సంయమనం పాటించి, బలహీనతలను అధిగమించారు కర్మలు చేశారు. పలితం ఆ యోగీశ్వరునికి వదిలేశారు.


అందుకే  రాజవంశపాలన కాబట్టి,  ఒక కుటుంబం అయినా అంతా తామై అధికారం పంచుకున్నా, ఆ కాలానికి అది సరితూగ గా విమర్శలకు ఆస్కారం లేకుండా ప్రజాపాలన సుభిక్షమైనది, జనరంజకమైంది.


Image result for kcr ktr kavita harish


ఇకపోతే తెలంగాణా విషయానికి వస్తే - తెలంగాణారాష్ట్ర సమితి అధినేత కలవకుంట్ల చంద్రశేఖరరావు వ్యూహాత్మక చతురుడు. అటు రాజకీయంగా ధర్మరాజు సహదేవుని గుణగణాల మిశ్రమం.


ఇక ఆయన తనయుడు కలవకుంట్ల తారక రామారావు ఒక రకంగా బుద్ధిశాలే కావచ్చు కాని ఈ కాలానికి భీముడు లాగా చెప్పవచ్చు. ఎదుటవారి మాటలదాడిని అంతే వేగంగా త్రిప్పి గొట్టటం (బౌన్స్-బాక్) ఆయన నైజం.


Related image


ఆయన మేనల్లుడు తన్నీరు హరీష్ రావు సకల రాజకీయ నైపుణ్యాలు వ్యూహాలు అమలు పరచగల నేర్పరి. అర్జునునిలా పార్టీకి ట్రబుల్-షూటర్ లాగా సమయస్పూర్తితో దిశానిర్దేశం చేసి సమస్యల ను సమసిపోయేలా సున్నితంగా చేయగలరు. అంతకు మించి ఆయనలోని సంయమన సుగుణం మరింతగా ఆయనను రాజకీయంగా ఉన్నతంగా నిలిపింది.


ఇక ఆయన తనయ కవిత సభ్యసమాజంలో అందరిలో కలసిపోయి సహదేవునిలా తన నైపుణ్యాల తో బుద్ధిని ప్రయోగించి సమాజాన్ని ఐఖ్యం చేసుకొని తమవైపుకు తిప్పుకోగల నేర్పరి. ఇదంతా కేసీఆర్ అభేధ్యమైన బలం.  ఇక ప్రజాశీర్వాదమే వీళ్ళ పాలిటి యోగీశ్వర కృష్ణుడు.


ఇది ప్రజాస్వామ్య సమాజం.  ఒకే కుటుంబ సభ్యుల నేతృత్వం హర్షనీయం కాదు. వీరెంత సమర్ధు లైనా అధికారం ప్రజలకు పంచకపోతే అది అత్యంత ప్రమాదకరం. చేదించలేని దయనీయమైన బలహీనతగా మారటం తధ్యం.  అందుకే కేసీఆర్ కు ఆయన కుటుంబమే చేదించతరంకాని బలహీనతగా చెప్పవచ్చు. ఇది వారంతా గుర్తుంచుకుంటే మంచిది. 


Related image


అందుకే చిరకాలం ప్రజాభిమానం నిలుపుకోవాలని చిరాయువుగా ఆశీర్వాదం పొందాలంటే డైనాస్టీ పోలిటిక్స్ ను వదిలేసి డెమాక్రసీ వైపుకు తన రాజకీయాన్ని ప్రజాస్వామీకరణ ఎంత త్వరగా చేస్తే ఆయనకు బలం మాత్రమే మిగిలి బలహీనత క్రమంగా తరిగిపోతుంది. 


Related image


ఏమాత్రం దారి తప్పినా ఈ ప్రజాస్వామ్య సమాజం ఎంత శక్తివంతమైన తీర్పు యివ్వగలదో, నిన్న టీఆరెస్ కు ఇచ్చిన విజయమే తార్కాణం.


 Image result for pancha pandavulu images

మరింత సమాచారం తెలుసుకోండి: