ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని..ముఖ్యంగా విద్యాభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నామని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు ఒంగోలులో జరిగిన ‘జ్ఞానభేరి’కార్యక్రమంలో మాట్లాడారు.   ప్రతీ ఒక్కరూ విజన్ తో ముందుకు వెళ్లాలని తెలిపారు. దేశంలోని మహానుభావులు అంతా విజన్ తోనే ముందుకు వెళ్లారని గుర్త చేశారు. జాతీయ స్థాయి ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును విద్యార్థులంతా చూడాలని కోరారు. అన్ని యూనివర్శిటీలు విద్యార్థులను పోలవరం ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఏపీకి ప్రధాని మోదీ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఓ వైపు కేంద్రం ఎలాంటి సహకారం అందించకున్నా..చెక్కు చెదరని ధైర్యంతో రాష్ట్రాభివృద్ది కోసం పాటుపడుతున్నామని అన్నారు.  ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై ఢిల్లీకి 29సార్లు వెళ్లాలని తెలిపారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో కేంద్రంపై టీడీపీ పోరాటబాటపట్టిందని చంద్రబాబు తెలిపారు. 

కేంద్రానికి తొత్తులుగా వ్యవహరించే వారిని నెత్తిన పెట్టుకుంటుందని..న్యాయం అడిగిన వారిపై కక్ష్యపూరిత చర్యలకు పాల్పపడుతుందని అన్నారు. ఎప్పుడైతే కేంద్రంపై తిరుగుబాటుకు ప్రయత్నించామో ఆనాటి నుంచి కేంద్రం ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు దిగుతోందని ఆరోపించారు.  సీబీఐ, ఆర్బీఐ, ఆఖరికి న్యాయవ్యవస్థలను కూడా వినాశనం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రకాశం జిల్లాను ఇండస్ట్రీయల్ హబ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. దోనకొండను ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ గా మారుస్తానని ప్రకటించారు. జాతీయ రహదారులు అత్యధికంగా ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా అని కొనియాడారు. పోర్టు కూడా నిర్మిస్తామని తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లాను కరువు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతానని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: