తెలంగాణా ఎన్నికల ఫలితాల్లో నాలుగింట మూడొంతులు గెలుచుకుని టీయారెస్ విజయ ఢంకా మోగించింది. ఈ ఎన్నికల ఫలితాలు అనేక ప్రశ్నలకు తగిన జవాబు చెప్పాయి. అనైతిక పొత్తులకు, హడావిడి ఒప్పందాలకు, బహుముఖ పోటీలకు తగిన ఫలితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా చూపించాయి. మరి వాటిని విశ్లేషణ చేసుకుంటే ఏపీ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.


బహుముఖమైనా అంతే:


తెలంగాణా ఎన్నికల్లో బహుముఖ పోటీలు జరిగాయి. టీయారెస్ ఒంటరిగా వస్తే, కాంగ్రెస్ కూటమిలో టీడీపీ, సీపీఐ, తెలంగాణా జన సమితి వంటివి చేరాయి. మరో వైపు బీఎల్ ఎఫ్  అంటూ సీపీఎం ఓ ప్రయోగం చేసింది. ఇంకో వైపు బీజేపీ ఒంటరిగా పోటీ పడింది. ఇలా అన్ని పార్టీలు పోటీ చేసినా కూడా ఓటరు ఎక్కడా తికమక పడలేదు. తాను అనుకున్న పార్టీకే ఓటు వేసి గెలిపించాడు. అంతే కాదు. ప్రత్య‌ర్ధుల దిమ్మ తిరిగేలా తిరుగులేని తీర్పుని ఇచ్చి అధ్బుతమైన మెజారిటీని కూడా కట్టబెట్టాడు.


ఏపీలోనూ అంతేనా :


ఇక మరో నాలుగైదు నెలల్లో జరిగే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఓటరు తీరు ఇలాగే ఉంటుందా అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఎందుచేతనంటే ఏపీలో కూడా బహుముఖ పోటీలు జరగనున్నాయి. కాంగ్రెస్ టీడీపీ ఒక కూటమిగా, జనసేన, వామపక్షాలు మరో కూటమిగా, బీజేపీ, వైసీపీ ఒంటరిగా బరిలో దిగనున్నాయి. మరొ ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందన్న చర్చ అపుడే మొదలైంది. 

నిజానికి ఓటరు తాను ఎన్నుకోవాల్సిన పార్టీని కనుక‌ గుర్తుపెట్టుకుంటే మిగిలిన పార్టీలు ఎన్ని రంగంలో ఉన్నా పట్టించుకోడన్నది తెలంగాణా పోరులో స్పష్టమైంది. ఇక్కడ కూడా ఏదో ఒక పార్టీకే జై కొడతారని కూడా అంటున్నారు. మధ్యలో ఎన్ని పార్టీలు వచ్చి గందరగోళం పెట్టినా కూడా ఓటరు తాను గెలిపించాలనుకున్న పార్టీ మీద క్లారిటీతో ఉన్నపుడు కచ్చితమైన విజయం ఆ పార్టీకే దక్కుతుందని అంటున్నారు. 


హంగు ఎపుడూ లేదు :


పైగా రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారి సెంటిమెంట్, ఆలోచనా విధానం ఒక్కటిగానే  ఉంటాయని కూడా అంటున్నారు. ఇక ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ లో కూడా హంగ్ వచ్చిన సందర్భాలు ఎపుడూ లేవని గుర్తు చేస్తున్నారు. కర్నాటకలో మాదిరిగా ఇక్కడ హంగు వస్తే హడావుడి చేద్దామనుకునే పార్టీలు తెలంగాణా ఫలితాల‌ను చూసి జాగ్రత్త పడాలని కూడా సూచిన్స్తున్నారు. ఏపీలో జనం  ఒకే పార్టీకి గుత్తమొత్తంగా ఓట్లు వేసి గెలిపిస్తారని, పూర్తి మెజారిటీ కట్టబెడతారని తెలంగాణా ఫలితాలు  సూచిస్తున్నాయి. ఇది రాజకీయ  నేతలనే, కాదు, పార్టీల అధినేతలను కూడా ఆలోచింపచేసే ఫలితమే.


మరింత సమాచారం తెలుసుకోండి: