ప్రతి ఎన్నికల్లో విజయం బయటకు కనిపిస్తుంది కానీ వెనకాల అనేక కారణాలు ఉంటాయి. ఊరికే ఓటరు పోలింగ్ బూత్ కి వెళ్ళి ఓటు వేయడు. ఈ ప్రభుత్వం ఉండాలని బలంగా కోరుకున్నా, పోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా ఓటర్లతో పొలింగ్ స్టేషన్లు పోటెత్తుతాయి. అపుడే భారీఎత్తున పోలింగ్ శాతం కూడా నమోదు అవుతుంది. మరి తెలంగాణాలో అదే జరిగింది. ఇక ఏపీ ముచ్చట ఏంటో.


సెంటిమెంట్ అస్త్రం:


తెలంగాణా సెంటిమెంట్ అస్త్రం తీసి కేసీయార్ తెలంగాణా ఎన్నికల్లో గెలిచాడని మొత్తానికి విశ్లేషణలు వచ్చాయి. అది నిజమే అనిపించేలా భారీ పోలింగ్, ఆనక టీయారెస్ కి భారీ ఎత్తున సీట్లు రావడం కూడా అంతా చూశారు. మరి అటువంటి సెంటిమెంట్ ఏపీలోనూ రగల్చగలరా, అది జరిగితే ఓట్లు రాళ్చుకోవచ్చునా. గత రెండు రోజులుగా తెలుగు తమ్ముళ్ళ మాటలను బట్టి చూస్తూంటే విభజన నాటి గాయాలని లేపి సెంటిమెంట్ పూత పూయాలన్న ఆలోచన ఉన్నట్లుగా కనిపిస్తోంది.


కేసీయార్ వస్తే :


ఏపీ ఎన్నికల్లో తానూ వేలు పెడతానని, బాబుకు బదులు బహుమానం ఇస్తామని ఇప్పటికే కేసీయార్ ప్రకటించారు. దానిపైన ఇపుడు ఏపీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బాబుపై యుధ్ధం అంటూ కేసీయార్ ఆంధ్రాకు వస్తే అది ఎవరికి మేలు, మరెవరికి చేటు అన్న కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి. కేసీయార్ ఆంధ్రాకు వస్తే చంద్రబాబుకే లాభం అని, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎంపీ సబ్బం హరి అంటున్నారు. 

ఇదే విధంగా పలువురు తెలుగు తమ్ముళ్ళు, మంత్రుల మాటగా కూడా ఉంది. ఆయన జగన్ కి మద్దతుగా వస్తే తాము విభజన నాటి పాత గాయాలను బయటకు తీస్తామని అపుడే తమ వ్యూహాలను చెప్పకనే చెబుతున్నారు. కేసీయార్ ఆధ్రులను ఎన్ని రకాలుగా తిట్టారో అవన్నీ జనం ముందు ఉంచి సెంటిమెంట్ రగిలిస్తామని కూడా చెబుతున్నారు.


వర్కౌట్ అయ్యేనా :


నిజానికి ఉధ్రుతంగా తెలంగాణా ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే ఏపీలో పెద్దగా సెంటిమెంట్ లేదన్నది చాల మంది మాట. అప్పట్లో లగడపాటి రాజగోపాల్ లాంటి వారు సమైక్య ఉద్యమాలు చేసినా స్పందన లేని విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇక కేసీయర్ పట్ల అపుడే లేని ద్వేషం ఇపుడు ఎందుకు ఉంటుందని కూడా అంటున్నారు. పైగా నాలుగున్నరేళ్ల పాలన చూసిన తరువాత హైదరాబాద్ లో సెటిల్ అయిన సీమాంధులంతా అక్కడ సేఫ్ గా ఉన్నామని భావిస్తున్నారు. 

ఇక ఏపీలోనూ కేసీయార్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు. ఆయన తన సొంత రాష్ట్రం కోసం పోరాడాడు తప్ప ఆంధ్రులంతే ద్వేషం లేదన్న సంగతి అంద్రవారు  గ్రహించారు కాబట్టే, ఈసారి సెటిలర్లు కూడా పెద్ద ఎత్తున టీయారెస్ కి ఓటు వేశారు. మరి అటువంటిది ఆంధ్ర సెంటిమెంట్ అంటూ కొత్త అస్త్రం టీడీపీ తమ్ముళ్ళు తీసినా ఉపయోగం అసలు ఉండదని కూడా అంటున్నరు. పైగా అడ్డగోలు విభజనకు అసలు కారణమైన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేసీయార్ ని నిందిస్తే మొత్తం సీన్ రివర్స్ అవుతుందని కూడా చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: