తెలంగాణలో ప్రజాకూటమి, టీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఏం జరిగింది.. కేసీఆర్ బుల్ డోజర్ మెజార్టీతో గెలిచారు. మరి ఈ గెలుపు ఎలా సాధ్యమైంది. దీనికి సమాధానంగా అంతా చంద్రబాబు వైపే వేలెత్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువగా చంద్రబాబు కేసీఆర్ సర్కారుపై దుమ్మెత్తిపోయడాన్ని తెలంగాణ జనం జీర్ణించుకోలేకపోయినట్టి ఫలితాలను చూస్తే అర్థమవుతోంది.



ఇప్పుడు గెలిచిన కేసీఆర్ ఏమంటున్నాడు.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. తానూ ఆంధ్రా వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానంటున్నాడు. అలా చేస్తే ఏమవుతుంది. సేమ్ తెలంగాణ సీన్ రిపీటయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతిపక్షాలు పొరుగు రాష్ట్ర సీఎంతో కుమ్మక్కయ్యారని చంద్రబాబు గగ్గోలు పెడుతారు.



మళ్లీ ఆంధ్రా సెంటిమెంట్ రెయిజవుతుంది. అది చంద్రబాబుకు లాభిస్తుంది. అసలే కష్టాల్లో ఉన్న ఏపీని గాడిన పెడుతున్నానని చెబుతున్న ఆయన వాదనకు బలం చేకూరుతుంది. ఇదంతా చూస్తే.. అసలు కేసీఆర్, చంద్రబాబు కొన్ని నెలలకు ముందే కూడబలుక్కుని ఈ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు మీడియా పెద్దలు కేసీఆర్, చంద్రబాబుకు రాజీ కుదిర్చిన సంగతి తెలిసిందే.

Image result for sabbam hari


ఇదే అనుమానాలు సపోర్ట్ చేస్తూ మాజీ ఎంపీ సబ్బం హరి కామెంట్ చేశారు"తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి సీఎం చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తే.. ఆయనలాగే చంద్రబాబు కూడా మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని.. అందులో సందేహం లేదని ఆయన చెబుతున్నారు. వాస్తవం కూడా అలాగే అనిపిస్తోంది. మరి కేసీఆర్- బాబు మాటల యుద్ధం నిజమా.. వ్యూహాత్మకమా.. లోగుట్టు వారికే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: