కేసీఆర్ జాతకంలో 2019 మార్చి తర్వాత గండం ఉందా.. వచ్చే ఏడాది మొదటి అర్థ భాగంలో ఆయన జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయా.. అంటే అవునంటున్నారు సంతోష్ కుమార్ అనే జ్యోతిష్యుడు. కేసీఆర్ కు రాజయోగంపై 10 టీవీ చేపట్టిన చర్చలో ఆయన ఆసక్తికరమైన అంశాలు వివరించారు. ప్రస్తుతం కేసీఆర్ జాతకం అద్భుతంగా ఉన్నా.. వచ్చే ఏడాది ఇబ్బంది ఉంటుందంటున్నారు.



వచ్చే ఏడాది జాతకంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కేసీఆర్ తెలంగాణలోనే ఉంటే బావుంటుందంటున్నారు. ఆయన జాతకంలో ఏప్రిల్ తర్వాత కొద్దిగా తేడా ఉందంటున్నారు. కేసీఆర్ కు ప్రస్తుతం రాజయోగం నడుస్తోందని.. ఆయన రాష్ట్రంలోనే అత్యున్నతమైన రాజపీఠం దక్కినందువల్ల ఆయన రాష్ట్రానికే పరిమితం కావాలని చెబుతున్నారు. ఇదే పరిస్థితి జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్పలేమని సంతోష్ కుమార్ చెబుతున్నారు.

Image result for astrology


జాతీయ స్థాయిలో ఆయన ప్రత్యర్థుల జాతకాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన నొక్కి చెబుతున్నారు. ఐతే చర్చలో పాల్గొన్న మరో జ్యోతిష్యుడు ప్రదీప్ జోషి మాత్రం దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప సీరియస్ ఇబ్బందులు ఏమీ ఉండబోవంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యాన్ని వైద్యులు సరిగ్గానే చూసుకుంటారని అది అంత పెద్ద ఇబ్బంది పెట్టే అంశం కాబోదని ప్రదీప్ జోషి అంటున్నారు.



మరి వాస్తు, జాతకాలు వంటి నమ్మకాలు ఉన్న కేసీఆర్.. తన జాతకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. కేసీఆర్ టీమ్ ఇలాంటి వాటిని జాగ్రత్తగా డీల్ చేస్తుందని.. వారికి మీడియా ద్వారా ఈ విషయాలన్నీ తెలుస్తాయని చర్చలో పాల్గొన్న జ్యోతిష్యులు దీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా కేసీఆర్ సీఎం అయ్యాక టీవీ ఛానళ్లు కూడా జ్యోతిష్యాలపై చర్చలు పెంచేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: