ఆంధ్రప్రదేశ్ లో టిఆర్ఎస్ కు క్రేజు పెరుగుతోంది. మామూలుగానే కెసియార్ అంటే క్రేజుంది. కెసియార్ మూడు సార్లు ఏపిలో పర్యటించినపుడు ఆ విషయం స్పష్టంగా బయటపడింది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణాలో దాదాపు క్లీన్ స్వీప్ చేయటంతో క్రేజు మరింత పెరిగిపోయింది. ఏపిలోని పలు జిల్లాల్లో టిఆర్ఎస్ విజయానికి సంబరాలు చేసుకున్నారు. అంటే సంబరాలు చేసుకున్న వారిలో అత్యధికులు కెసియార్ సామాజికవర్గానికి చెందిన వెలమలే అనుకోండి. ఏదేమైనా చంద్రబాబునాయుడుకు బద్ద విరోధిగా మారిన రాజకీయ ప్రత్యర్ధి సాధించిన ఘన విజయంపై ఏపిలో సంబరాలు  చేసుకోవటమంటే మామూలు విషయం కాదు కదా ?

 

ఏపిలోని విశాఖపట్నం, ప్రకాశం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో వెలమసంఘాలు, వెలమ యువజన సంఘాల ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరిగాయి. పై జిల్లాల్లోని వెలమ సంఘాల కార్యాలయాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. కెసియార్ ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు వెలిశాయి. పై ఊర్లలో కెసియార్ కు జిందాబాద్ లు చెబుతూ భారీ ర్యాలీలు కూడా తీయటం గమనార్హం. కెసియార్ తెలంగాణాలో మళ్ళీ గెలిచినందుకు ఏదో అభిమానం కొద్దీ ర్యాలీలు తీయటం, ఫ్లెక్సీలు పెట్టారని అనుకునేందుకు లేదు.

 

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుపై వ్యతిరేకత చాపనీరులాగ కాకుండా బయటకే కనబడుతున్నట్లే అర్ధమవుతోంది. లేకపోతే ఏపిలో కెసియార్ కు బహిరంగంగా మద్దతు పలకటం, పెరుగుతుండటం దేనికి సంకేతాలు ? ఆమధ్య తిరుపతికి వచ్చినపుడు, అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్  వివాహానికి హాజరైనపుడు, విజయవాడకు వచ్చినపుడు కూడా జనాలు కెసియార్ కు బహిరంగంగానే జిందాబాదులు కొట్టారు. గుడివాడలో వైసిపి ఎంఎల్ఏ కొడాలినాని పేరుతో వెలసిన ఫ్లెక్సీలో కెసియార్ ఫొటోతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, కింజరాపు యర్రన్నాయడు, తాండ్రపాపారాయుడు ఫొటోలను కూడా ముద్రించటం గమనార్హం. ఒంగోలులో కెసియార్ పేరుతో వాల్ పోస్టర్లు, తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టటం కొసమెరుపు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: