కేసీఆర్ ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పినాడు. ఆంధ్ర రాజకీయాల్లో కి వస్తానని చంద్ర బాబు కు గిఫ్ట్ ఇస్తానని అయితే కేసీఆర్ మాటలను బట్టి చూస్తే జగన్ తరుపున ప్రచారం చేసే విధంగా కనిపిస్తున్నారు . ఏపి రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోవాలి..చంద్ర‌బాబు ను ఇర‌కాటంలో పెట్టాల‌ని కెసిఆర్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. అయితే, కెసిఆర్ అంచ‌నా వేసినంత సులువుగా ఏపి రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోగ‌ల‌రా అనే సందేహం వ్య‌క్తం అవుతోంది.

చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం

కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం అయిన టిఆర్‌య‌స్ ఏపి రాజ‌కీయాల్లో నేరుగా జోక్యం చేసుకొనే ప‌రిస్థితి లేదు. దీంతో..అక్క‌డ చంద్ర‌బాబును ఇబ్బంది పెట్టాలంటే టిడిపి వ్య‌తిరేక పార్టీల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాలి. అందులో భాగంగా.. వైసిపి వైపే కెసిఆర్ మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. 2014 ఎన్నిక‌ల్లోనే ఏపిలో వైసిపి గెలుస్తుంద‌ని కెసిఆర్ జోస్యం చెప్పారు. కానీ, అది సాధ్య‌ప‌డ‌లేదు. ఇక‌, ఇప్పుడు తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో చేతులు క‌లిపి..టిఆర్‌య‌స్ ను ఓడించ‌టానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేసార‌ని..ప్ర‌చార చేసార‌నే కార‌ణంతో ఏపిలో జోక్యం చేస‌కుంటామ‌ని..రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని కెసిఆర్ చెబుతున్నారు.  

కెసిఆర్ ల‌క్ష్యం

ఇక‌, ఏపిలో టిఆర్‌య‌స్ జోక్యం చేసుకుంటే వైసిపి కి లాభ‌మా న‌ష్టమా అనే చ‌ర్చ మొద‌లైంది. టిడిపికి వ్య‌తిరేకంగా కెసిఆర్ ఏపిలో ప్ర‌చారం చేస్తే..అస‌లు ఏపిలో స‌మ‌స్య‌ల‌కు కార‌ణం రాష్ట్ర విభ‌జ‌న అని..అందుకు కార‌ణం కెసిఆర్ అని టిడిపి బ‌లంగా ప్రచారం చేసే అవ‌కాశం ఉంది. ఏపి క‌ష్టాల‌కు కార‌ణ‌మైన కెసిఆర్ ..జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు గా నిలిస్తే..తెలంగాణ లో బాబు కార‌ణంగా కాంగ్రెస్ కు న‌ష్టం క‌లిగితే..ఏపిలో కెసిఆర్ కార‌ణంగా జ‌గ‌న్ కు నష్టం క‌లిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, చంద్ర‌బాబు సైతం తెలంగాణ ఎన్నిక‌ల్లో తొలుత టిఆర్‌య‌స్ తోనే క‌లిసి వెళ్లాల‌ని భావించిన విష‌యాన్ని వైసిపి నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఏపిని విభ‌జించిన కాంగ్రెస్ తో జ‌త క‌ట్టిన చంద్ర‌బాబు..త‌మకు కెసిఆర్ మ‌ద్ద‌తుగా నిలిస్తే విమ‌ర్శించే అర్హ‌త ఉండ‌ద‌న్న‌ది వైసిపి నేత‌ల వాద‌న‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: