5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కదన రంగానికి సిద్ధపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన 5 రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగినా.. మూడు చోట్ల ఆ పార్టీ గెలుపొందడం పార్టీ శ్రేణులకు కొత్త బలాన్నిచ్చింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలను చేజిక్కించుకోవడంతో కాంగ్రెస్‌ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి.

 Image result for congress party

వాస్తవానికి ఈ ఎన్నికలపై అనేక మంది అనేక రకాలుగా కన్నేశారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలో వస్తుందని.. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే జనరల్ ఎలక్షన్స్ టఫ్ గా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తూ వచ్చారు. బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటే మోదీ హవాకు తిరుగులేదని తేలుతుందని, అదే కాంగ్రెస్‌ గెలిస్తే ఆ పార్టీ పునరుజ్జీవానికి అవకాశం లభిస్తుందని భావించారు. తాజా ఫలితాలను గమనిస్తే కాంగ్రెస్ కు పునరుత్తేజం వచ్చినట్లే..! దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో కలిసి ఎదుర్కోగలిగితే రాహుల్ కు పీఠం అందినట్లే!

 Image result for congress party

రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల విజయం ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్‌ శ్రేణులు వచ్చే ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. ఒక పక్క అంతర్గత కుమ్ములాటలను నియంత్రించడంతో పాటు బలమైన బీజేపీను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను కాంగ్రెస్‌ రూపొందించుకోవాల్సి ఉంటుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో బాటు కాంగ్రెస్‌ అధీనంలో ఉన్న పలు రాష్ట్రాలను కైవసం చేసుకోవడంతో కమలనాథులు ఇక దేశంలో తమకు తిరుగులేదన్న ధోరణిలో ఉండిన్నారు. కాంగ్రెస్‌ తమకు పోటీయే కాదని, రాహుల్‌ గాంధీ ‘పప్పు’ అని బీజేపీ శ్రేణులు భావించాయి. అయితే.. తాజా ఎన్నికల ఫలితాలు రాహుల్‌ గాంధీ సత్తాను బీజేపీకి చూపించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి రాహుల్‌ గాంధీయే పోటీ అని నిరూపించాయి.

 Image result for congress party

బీజేపీకి కంచుకోటగా భావించిన రాష్ట్రాలు ఇప్పుడు విపక్షాల వశమయ్యాయి. బీజేపీకి గట్టి పట్టున్న ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీని మట్టికరిపించడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం. తెలంగాణలో ఘోర పరాజయం ఎదురుకావడం, మిజోరంలో అధికారాన్ని కోల్పోవడం మింగుడు పడకపోయినా.. మూడు రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు ఆ పార్టీకి ఉపశమనాన్ని ఇచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో విజయం కాంగ్రెస్‌కు చాలా ప్రత్యేకం. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లను ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటిచేత్తో గెల్చుకుంది. నిజానికి బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ఉద్దేశంతో ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అయినా అక్కడ కాంగ్రెస్‌ పైచేయి సాధించింది.

 Image result for congress party

 ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బీఎస్పీపై ఆధారపడేలా చేయాలని మాయావతి వ్యూహరచన చేశారు. అది విఫలమైంది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో మాత్రమే కాంగ్రెస్‌కు బీఎస్పీ తోడ్పాటు అవసరం కావొచ్చు. మద్దతు కోసం కాంగ్రెస్‌ తన తలుపు తడితే మాయవతి ఒకింత కఠిన వైఖరినీ ప్రదర్శించవచ్చు. గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని రాహుల్‌ గాంధీ చేపట్టాక.. కర్ణాటకలో జేడీఎస్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేయగలిగింది. తాజాగా బీజేపీకి గట్టి పట్టున్న మూడు రాష్ట్రాల్లో సాధించిన విజయం రాహుల్‌ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఈ ఊపుతో ఆయన.. పార్టీలో కొత్త తరానికి మరిన్ని బాధ్యతలు అప్పగించే దిశగా ముందడుగు వేయవచ్చు.

 Image result for congress party

కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ అప్పటికీ, ఇప్పటికీ ఎంతో పరిణతి సాధించారు. ఏడాది క్రితం కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన రాహుల్‌కు, ఇప్పటి రాహుల్‌కు చాలాతేడా ఉంది. ఆయన బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలకమైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో మెరుగైన ఫలితాలు సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోని 65 స్థానాల్లో బీజేపీ 62 సీట్లను గెలుచుకోగలిగింది. మిజోరంతో పాటు తెలంగాణలో ఓటమి పాలైనప్పటికీ రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఈ 3 రాష్ట్రాల్లో పురోగతి సాధించడం కీలక పరిణామం’ అని వ్యాఖ్యానించారు. విపక్షాలన్నీ కలిసి ఏర్పడే మహాకూటమిలో కాంగ్రెస్‌ కీలకంగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: