ఏపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డిపై హత్యా ప్రయత్నం కేసు డిసెంబర్ 3 మరియు 5 తారీఖుల్లో విచారణ జరిపిన హైకోర్ట్ రేపు మరోసారి విచారణ జరప నుంది. దానిపై ఏపి ప్రభుత్వానికి  హైకోర్టులో చుక్కెదురైంది. ఎయిర్‌-పోర్టులో దాడి జరిగితే ఏపి రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారు? అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్‌ఐఏ కు ఎందుకు అప్పగించలేదని నిలదీసింది. 


అసలు ఈ కేసు రాష్ట్ర పోలీసులకు సంభందించినది కాదని, తమది కాని కేసు రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేస్తున్నారు? ఈ కేసును ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ ధాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రేపు బుధవారానికి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా 
Related image
అదే హైకోర్టులో నేడు తిరుమల తిరుపతి దేవస్థానం - టిటిడికి ధారుణమైన ఎదురు దెబ్బ తగిలింది. వంశపారంపర్య అర్చకులను పదవీ విరమణ లేకుండా కొనసాగించా లని హైకోర్టు నేడు (గురువారం) టీటీడీని ఆదేశించింది. అసలు విషయం ఏమంటే తిరుమల, తిరుచానూరు, గోవిందరాజస్వామి ఆలయాల్లో సేవలు చేస్తున్న వంశపారం పర్య అర్చకులపై టీటీడీ పదవీ విరమణ నిబంధనలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 
Image result for high court questions TTD
తిరుమల ప్రధాన అర్చకులుగా కొనసాగిన రమణ దీక్షితులను టీటీడీ పదవీ విరమణ నిబంధనలను చూపి విధుల నుంచి తొలగించింది.  టీటీడీ అమలు చేస్తున్న నిబంధనలను తొలగించాలని ఏబీ శేషాద్రి ఆచార్యులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం టీటీడీ నిర్ణయాన్ని తప్పుపట్టింది. 



దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో తీసుకొచ్చిన 33/2007 చట్టప్రకారం తిరుమల అర్చకులకు వంశపారం పర్య అర్చకత్వం చేసే హక్కు ఉందని కోర్టు తెలిపింది. హైకోర్టు నిర్ణయం పట్ల వంశపారంపర్య అర్చకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


హైకోర్టు తీర్పు మిరాశి అర్చకులకు అనుకూలంగా తీర్పు రావడంతో టీటీడీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. గోవిందరాజ స్వామి, తిరుచానూరు ఆలయాల్లో మిరాశి అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని అమలు చేసింది.  


2012 లో ఇదే నిబంధనను టీటీడీ అమలు చేసింది. ఆ సమయంలో కూడ అర్చకులు హైకోర్టును ఆశ్రయించి టీటీడీకి వ్యతి రేకంగా విజయం సాధించారు. ఈ ఏడాది మే లో వయో పరిమితి విధించింది. 


65ఏళ్ల దాటిన అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్చకులు హైకోర్టు ను ఆశ్రయించారు. హైకోర్టు టీటీడీకి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని టీటీడీ భావిస్తోంది.


Image result for high court questions TTD

మరింత సమాచారం తెలుసుకోండి: