గెలుపు అన్నది ఎంతటి అర్బకున్ని అయినా మహా బలున్ని చేస్తుంది. గడ్డి పోచను సైతం   మేరు పర్వతంగా మారుస్తుంది. విజయంలో మజా అలా ఉంటుంది. నన్ను మించిన వారు లేరనిపించేలా చేస్తుంది. అవసరం కోసం ఎన్ని అయినా అనుకుంటారు. తీరా పరిస్థితిలో మార్పు వస్తే మాత్రం ఉల్టా పల్టా కొట్టేస్తారు. ఇదే పాలిట్రిక్స్ గ్రాండ్  ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కి తెలియదు అనుకోగలమా...


పొత్తు వద్దట :


నిన్నటి వరకూ ఏపీలో ఉనికి పోరాటం కాంగ్రెస్ ది. ఎవరూ తమను గుర్తించడంలేదని దిగులు పడిన పార్టీ అది. ఒక్కసారిగా మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలిచేసరికి ఏపీ హస్తం పార్టీ నేతలకు ఇపుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఏపీలో మేమే గెలుస్తాము. సొంతంగానే పోటీకి దిగుతాము అంటూ మీసాలు మెలేస్తున్నారు. ఈ మధ్యన టీడీపీ తో పొత్తు కోసం తహతహలాడినా ఖద్దరు నేతల నోటి వెంట ఇపుడు వేరే మాటలు వినిపిస్తున్నాయి. మాకు ఏపీ పెట్టని కోట. బలం చాల ఉంది పుంజుకుంటామంటూ భారీ స్టేట్మెంట్లు ఇపుడు ఇస్తున్నారు.


ఇంకా నిర్ణయం తీసుకోలేదు :


ఏపీలో టీడీపీతో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి అంటున్నారు. తాము ఏపీలో సొంతంగా పార్టీని నిలబెట్టేందుకే చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇంటింటికీ కాంగ్రెస్ పేరిట కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. పైగా తెలంగాణాలో టీదీపీతో కలసి వెళ్తే జనం తిరస్కరించారని రఘువీరా చెప్పడం విశేషం. అంటే ఏపీలో టీడీపీతో వెళ్తే జనం పక్కన పెడతారని ఆయన చెప్పకనే చెబుతున్నారు. అయిదు రాష్ట్రాల ఫలితాల తరువాత కాంగ్రెస్ స్వరంలో ఇంత మార్పు వచ్చేసింది మరి.


సైకిలెక్కమంటున్న సీనియర్లు :


ఇక డిల్లీలో కాంగ్రెస్ సీనియర్లు టీడీపీతో పొత్తు వద్దని చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఉమన్ చాందీ ఎదుట వీరంతా తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ సొంతంగానే వెళ్లాలని, పొత్తులు పెట్టుకుంటే వికటిస్తుందని కూడా ఉమన్ చందీకు చెబుతున్నారట. అదే విధంగా తమ బాధను అర్ధం చేసుకుని టీడీపీ తో పొత్తు లేకుందాఅ చేయాలని కాంగ్రెస్ పెద్ద నాయకుడు, రాహుల్ గాంధీ సన్నిహితుడైన అహ్మద్ పటేల్ తోనూ ఏపీ కాంగ్రెస్ పెద్దలు మొర పెట్టుకుంటున్నారట.

ఇదంతా చూస్తూంటే ఏపీలో కాంగ్రెస్ నాయకులు ఇపుడు టీడీపీకి పెద్ద షాకే ఇవ్వబోతున్నారని అర్ధమవుతోంది. సొంతంగా పోటీ అంటూ ఏపీలో కాంగ్రెస్ రంగంలోకి వస్తే ఒంటరి పోరు చెయాక తప్పదు టీడీపీకి. నిన్నటి వరకూ టీడీపీ కి జై అన్న వారు కాస్తా ఇపుడు ఉత్తరాది రాష్ట్రాలు గెలుచుకోవడంతో ఎక్కడ లేని హుషార్ తెచ్చుకుని ఏకంగా సైకిల్ పార్టీకే షాక్ ఇస్తున్నారు. మరి చూడాలి రాహుల్ జీ ఏమంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: