రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే కెసియార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేయాలన్న కారణంతో కొడుకు కెటియార ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. తాను పూర్తిగా ప్రభుత్వంపైనే దృష్టి పెట్టాలన్న కారణంతోనే కొడుకుకు పార్టీ కిరీటం పెట్టినట్లు అర్దమవుతోంది. అంటే ఎప్పటి నుండో ఇదే విషయమై పార్టీలోను, ప్రజల్లోను చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్లే కెసియార్ పావులు కదుపుతున్నారు.

Image result for ktr

రేపటి లోక్ సభ ఎన్నికల్లో కెసియార్ ఎంపిగా కూడా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలైన తర్వాత కెసియార్ జాతీయ రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెడతారని తెలుస్తోంది. అంటే కెసియార్  ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెడితే ఇక్కడ ముఖ్యమంత్రిగా కెటియార్ ను కూర్చోబెడతారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది. నిజానికి ప్రాంతీయ పార్టీలంటేనే ప్రైవేటు ఆస్తులనే అనుకోవాలి. టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసియార్ కాబట్టి పార్టీ కూడా ఆయన సొంతమనే చెప్పుకోవాలి. ఆయనిష్టం వచ్చిన వాళ్ళకు ఇష్టం వచ్చిన పదవులను ఇచ్చుకుంటారు.

Image result for ktr

అందులో ఎవరూ ఆక్షేపించేందుకు లేదు. ఎవరికైనా అభ్యంతరాలుంటే బయటకు వెళ్ళిపోవాల్సిందే కానీ వేరే దారిలేదు. ఒక్క ఏపిలో మాత్రమే అందుకు మినహాయింపు దక్కింది. ఎన్టీయార్ సంతానం రాజకీయంగా పనికిరాని వారవ్వబట్టి ఎన్టీయార్ అల్లుడు చంద్రబాబునాయుడు మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం  చేసుకున్నారు. అయితే, కెసియార్ విషయంలో అలా జరిగేందుకు అవకాశాలు తక్కవనే అనుకోవాలి. అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్ళు ఏమీ మాట్లాడని కెసియార్ రెండోసారి బ్రహ్మాండమైన మెజారిటితో గెలవగానే కొడుకు కెటియార్ కు పార్టీ పగ్గాలు అప్పగించేశారు.  

Image result for ktr

పార్టీకి వర్కిగ్ ప్రెసిడెంట్ అంటే పూర్తిస్ధాయి అధ్యక్షుడనే అనుకోవాలి. ఎందుకంటే, తండ్రి ముఖ్యమంత్రి అయినపుడు కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీ పగ్గాలు పూర్తిగా అప్పగించేసినట్లే. అంటే పార్టీ ప్రెసిడెంట్ అయిన కెటియార్ కు తదుపరి పోస్టు ముఖ్యమంత్రి పదవే అని అందరికీ అర్ధమైపోతోంది. పార్టీ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై పార్టీలోను, కెసియార్ ఇంట్లోను ఎప్పటి నుండో చర్చలు జరుగుతున్నాయి. కెసియార్ కుటుంబం, బంధువులు పార్టీ బాధ్యతలు కెటియార్ కు కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు.

Image result for ktr

అదే సమయంలో పార్టీలో మెజారిటీ నేతలు మాత్రం పార్టీ పగ్గాలు మేనల్లుడు హరీష్ రావుకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారట. నిజానికి టిఆర్ఎస్ అధికారంలోకి రాకముందు పార్టీని నడిపించింది హరీష్ రావే. కెసియార్ ఎప్పుడూ ఫాం హౌస్ లో కూర్చునే వారే తప్ప రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు, నిరసనల్లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నది తక్కువనే చెప్పాలి. అందుకే పార్టీలో హరీష్ అంటే క్రేజుంది. మరి మెజారిటీ నేతల అభిమతానికి వ్యతిరేకంగా కెటియార్ కు పార్టీ బాధ్యతలు అప్పగించిన వైనం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: