తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ గా తనయుడు కేటీఆర్‌ ను నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. త్వరలోనే కేటీఆర్‌కు తెలగాణ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్టు కూడా కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.


ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్ ను తెలంగాణ సీఎం చేసేందుకు క్రమంగా రూట్ క్లియర్ చేస్తున్నారు. అందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా కేటీఆర్‌ ను నియమించేశారు. భారతదేశంలోనే అతి గొప్ప పార్టీగా టిఆర్ఎస్ ను రూపుదిద్దాలన్నది కేసీఆర్ ఆలోచన. ఇప్పటి వరకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు.

Image result for kcr and ktr


ఈ నిర్ణయం పార్టీ వర్గాలకు కాస్త షాకింగ్ గా ఉన్నా.. అంత ఊహించనదేమీ కాదు. ఎన్నికలకు ముందు నుంచే ఈ ప్రచారం సాగుతోంది. విపక్షాలు కూడా ఈ విమర్శలు చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో కేటీఆర్ కీలక పాత్ర పోషించి పార్టీకి మంచి విజయం అందించిన దృష్ట్యా కేటీఆర్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం లో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది ఏదీ లేదు.

Related image


ఐతే.. ఈ నిర్ణయం పట్ల మరో కీలక నేత, కేసీఆర్ మేనల్లుడు ఎలా స్పందిస్తాడన్నదే ఆసక్తిదాయం. హరీశ్ కూడా ఈ పరిణామం ఊహించనిదేమీ కాదు. ఏదో ఒక రోజు ఇలాంటి రోజు వస్తుందని ఆయనకూ తెలుసు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లభిస్తే హరీశ్ కూడా సర్దుకుపోయే ఆలోచనలోనే ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: