తెలంగాణ ఎన్నికలు చాలా మందికి చేదు జ్ఞాపకాలనే మిగిల్చాయి. టీఆర్ఎస్ మాత్రమే ఇప్పుడు పండగ చేసుకుంటున్న సమయం. మిగిలిన అన్ని పార్టీలకూ ఇది కోలుకోలేని దెబ్బ. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేయని కొన్ని పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. అలాంటివాటిలో మొదటిది వైసీపీ. టీడీపీకి చావుదెబ్బ తగిలింది కాబట్టి ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. అయితే జనసేన కూడా ఎంతో హ్యాపీగా ఉంది. ఇందుకు కారణమేంటో తెలుసా..?

Image result for janasena telangana

వాస్తవానికి వచ్చే జనరల్ ఎలక్షన్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన ప్లాన్స్ వేసుకుంది. ఇందుకు తగ్గట్టే కార్యాచరణ రూపొందించుకుని కార్యక్రమాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నా.. తెలంగాణపైన కూడా పట్టుకోసం పవన్ కల్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు. ఆ మధ్య కొండగట్టు వెళ్లి అంజన్న ఆశీర్వాదం పొందారు. పార్టీ బలోపేతం కోసం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు ఆ సందర్భంగా ప్రకటించారు. త్వరలోనే జిల్లాలవారీగా పర్యటనలు కూడా చేస్తామన్నారు. అయితే ఇంతలో ఎన్నికలు రావడంతో పవన్ కల్యాణ్ అటువైపు చూడలేదు.

Image result for janasena telangana

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ సమయాభావం వల్ల పోటీ చేయలేకపోతున్నామని పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఇదే పవన్ కల్యాణ్ పాలిట వరమైందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో పోటీ చేసిన పార్టీలన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసి ఉంటే అన్నిపార్టీల్లాగే తీవ్ర పరాభవం తప్పేది కాదేమో.! సంస్థాగతంగా ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకానీ, గ్రేటర్ హైదరాబాద్ లో పట్టున్న పార్టీగా పేరొందిన టీడీపీ కానీ.. ఖమ్మం జిల్లాలో స్ట్రాంగ్ కేడర్ కలిగిన పార్టీలుగా పేరొందిన కమ్యూనిస్టులు... ఇలా అదీఇదీ అని కాకుండా అన్ని పార్టీలూ ఖంగుతిన్నాయి. అలాంటి చోట ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళ్తున్న జనసేన పోటీ చేసి ఉంటే ఫలితం ఇంతకంటే గొప్పగా ఉంటుందని భావించలేం.

Image result for janasena telangana

కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే ఒకానొక దశలో జనసేన పోటీ చేస్తే బాగుంటుందనే సూచనలు, సలహాలు పవన్ కల్యాణ్ కు వచ్చిన మాట వాస్తవం. అయితే వాటిపై ఆచితూచి అడుగేశారు జనసేనాని. వెంటనే సరేనని రంగంలోకి దిగకుండా కాస్త సంయమనం పాటించారు. పోటీ చేసి అభాసుపాలుకావడం కంటే పోటీ చేయకపోవడమే మంచిదనుకున్న పవన్ వ్యూహం ఫలించింది. అందుకే ఇప్పుడు జనసేన కూడా సంబరాలు చేసుకుంటోంది. తమ నేత వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని గట్టెక్కించారని ప్రశంసిస్తున్నారు. ఆడా ఉంటా ఈడా ఉంటా.. అన్నట్టు కాకుండా తను చేరాలనుకుంటున్న గమ్యంపై పవన్ కల్యాణ్ కు ఫుల్ క్లారిటీ ఉందని .. అందుకే తెలంగాణలో పోటీ చేయకుండా మంచి పని చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైతేనేం.. జనసేన వ్యూహం ఫలించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: