తెలంగాణలో మళ్ళీ వరుస ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ముందస్తు ఎన్నికల్లో గులాబీ దూకుడు ముందు విపక్షాలు కుదేల‌య్యాయి. కారు జోరుకు బ్రేకులు లేకుండా పోవడంతో హస్తం చిత్తు అయితే సైకిల్‌ చిత్తు చిత్తు అయిపోయింది. ఇక టీజేఎస్‌, సీపీఐ, బీజేపీ గురించి మాట్లాడుకునే పరిస్థితే లేదు. ఇక పంచాయ‌తీ ఎన్నికల నిర్వాహణపై హైకోర్ట్‌ ఆదేశాలు జారీ చెయ్యడంతో జనవరిలో పంచాయ‌తీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. జనవరిలో పంచాయ‌తీ ఎన్నికలు ముగిసిన వెంటనే సంక్రాంతి తర్వాత తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామానికి తెర లేవనుంది. ఏప్రియల్లో ఎలాగో తెలంగాణలో దేశ వ్యాప్తంగా జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకంటే ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేవనుంది. తాజా సాధారణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాలుపడుతున్నారంటూ ముగ్గురు ఎమ్మెల్సీలపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. 

Related image

ఈ ముగ్గురు ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేసి వీరిపై వేటు పడేలా చర్యలుతీసుకోవాలని కేసీఆర్‌ డిసైడ్‌ అయ్యారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక అయిన రాములు నాయక్‌, ఎమ్మెల్యేల కోటాలో యాదవరెడ్డి, స్థానిక సంస్థల కోటాలో భూపతి రెడ్డి ఎమ్మెల్సీలుగా గెలిచారు. వీరు ముగ్గురు ఎన్నికల ముంగిట తమకు టిక్కెట్లు రాలేదన్న అసంతృప్తితో పార్టీ మారిపోయారు. వీరిలో భూపతి రెడ్డి నిజమాబాద్‌ రూరల్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరు ముగ్గురితో పాటు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్సీలు అయిన పట్నం నరేందర్‌రెడ్డి (కొడంగల్‌), మైనంపల్లి హనుమంతరావు (మల్కాజ్‌గిరి) కూడా తమ పదవులకు రాజీనామా చెయ్యనున్నారు. దీంతో ఓవర్‌ ఆల్‌గా తెలంగాణలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. 

Image result for kcr

ఈ ఎమ్మెల్సీలను ఇతర నాయకులతో భ‌ర్తీ చేసేందుకు కేసీఆర్‌ రంగం సిద్ధం చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఐదుగురు కీలక నేతలు ఓడిపోయారు. ఈ ఎమ్మెల్సీ సీట్లు వీరితో భ‌ర్తీ చేస్తారా ? లేదా టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలకు ఈ సీట్లు కేటాయిస్తారా ? అన్నది కేసీఆర్‌ ఇష్టం. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో కూడా వార్‌ కారుకు వ‌న్‌ సైడ్‌గానే ఉండడం ఖాయంగానే కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఫామ్‌ చూస్తుంటే వచ్చే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఎంత మేర‌ టీఆర్‌ఎస్‌ పార్టీని తట్టుకుని నిలపడుతుందని చెప్పడం సందేహంగానే కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: