రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఊరట లభించింది. రాఫెల్ ఒప్పందానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారద్శకంగానే భారత ప్రభుత్వం, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగిందని వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంటూ సుప్రీంకోర్టు విచారణకు దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేసింది. 


రాఫెల్‌ డీల్‌కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను కోర్టు ఏకంగా  తోసిపుచ్చింది. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ విమానాల ధరలను దేశభద్రత దృష్ట్యా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.


అనేక డీల్స్ లోపభూయిష్టంగా చేసి దేశాన్ని ఆర్ధికంగా దివాలా స్థాయికి తీసుకెళ్ళిన కాంగ్రెస్ కు తమ అపోనెంట్ సారధ్యంలోని ప్రభుత్వం ఏమిచేసినా తప్పుగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఒక పచ్చకళ్ళ రోగి దానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అదే సుప్రీం కోర్ట్ కేసు కొట్టివేయటం ద్వారా చెప్పింది. దేశం మొత్తాన్ని రాహుల్ గాంధి తప్పుదారి బట్టించారని అనేకమంది రక్షణ నిపుణులు చెపుతున్నారు.

Related image 

దీనితో దేశరాజకీయాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రఫేల్‌ అంశంపై కేంద్రానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసి పుచ్చింది. రఫేల్‌ ఒప్పందంలో అవమానించదగ్గ వివరాలేమీ లేవని, ఇది వాణిజ్యపరమైన ఒప్పందం అని సమర్థించేలా ఎలాంటి పత్రాలను తాము గుర్తించ లేదని న్యాయస్థానం తెలిపింది. రఫేల్‌ ధర, ఒప్పందం నిర్ణయంపై ఎలాంటి దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

 

 కేంద్రానికి 36 బదులు 126 విమానాలు కొనుగోలు చేయమని చెప్పలేమని స్పష్టం చేస్తూ, ఒప్పందంలోని ప్రతి అంశాన్ని కోర్టు పరిశీలించ లేదని స్పష్టం చేసింది. వ్యక్తుల అభిప్రాయాల ఆధారంగా తాము విచారణ జరపలేమని పేర్కొంది. ఈ ఒప్పందంలో ఒక పార్టీకి ఆర్థికంగా ప్రయోజనం చేకూరినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టు పేర్కొంది

Image result for rafale deal 

 భారత ప్రభుత్వం 36రాఫెల్ యుద్ధవిమానాల తయారీకి ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ కంపెనీతో ₹59000  కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2016లో ప్రధాని నరేంద్రమోడీ, నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండే లు ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే, ఈ విషయంలో అవకతవకలు జరిగాయంటూ, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించాయి. కాగా, ఈ రోజు న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. 

 Related image

విమానాల ధరల విషయం కొనుగోలు కమిటీ చూసుకుంటుందని పేర్కొంది. ఒప్పందంలో అనుమానించాల్సిన అంశాలేమీ లేవని జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. దేశ రక్షణ ను దృష్టిలో ఉంచుకుని ఒప్పందంపై చర్చ అనవసరమని పేర్కొంది. రాఫెల్‌ ఒప్పందం ప్రకటించినప్పుడు అభ్యంతరాలు ఎందుకు రాలేదని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. రాఫెల్‌ ఒప్పందంపై దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది.


రాఫెల్‌ ఒప్పందంలో మోదీ సర్కార్‌ లక్ష్యంగా విమర్శల దాడి ఎక్కుపెట్టిన కాంగ్రెస్‌కు సుప్రీం కోర్టు తీర్పుతో నిరాశ ఎదు రైంది. ₹56000 కోట్లతో 36 విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య జరిగిన ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఆఫ్‌సెట్‌ పార్టనర్‌గా భారత్‌ సూచనతోనే దసాల్ట్‌ ఏవియేషన్‌ ఎంపిక చేసుకుందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ వెల్లడించడం కలకలం రేపింది. ఈ ఒప్పందం పై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు పట్టుబట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: