ఎన్టీఆర్ బయో పిక్ సినిమా ఆడియో ఫంక్షన్  కొన్ని రోజుల్లో జరగబోతుంది అయితే ఇంత వరకు జూనియర్ కు ఆహ్వానం అందలేదంటా ... ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కాబట్టి, సభ్యులంతా రావడం అన్నది పద్దతిగా వుంటుంది, చూడడానికి బాగుంటుంది.  అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కు వస్తారా? ఆయనను ఆహ్వానిస్తారా? ఫ్యామిలీ సభ్యులు అంతా అంటున్నారు. మరి లక్ష్మీపార్వతి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని పిలుస్తారా? పిలవరా? అన్న ప్రశ్నలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Image result for jr ntr

ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ క్యాంప్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎటు వంటి ఆహ్వానం అందలేదు. అయితే ఇంకా వారంరోజుల టైమ్ వుంది. ఆలోగా బాలయ్య ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇటీవల బాలయ్య-ఎన్టీఆర్ బాగానే దగ్గరయ్యారు. కళ్యాణ్ రామ్ ను బయోపిక్ లోకి తీసుకున్నారు. అందువల్ల కళ్యాణ్ రామ్ ను ఎలాగూ పిలుస్తారు. పనిలో పనిగా ఎన్టీఆర్ కూడా పిలవడం పక్కాకావచ్చు.

Image result for ntr bio pic

అయితే కూకట్ పల్లిలో చుండ్రు (నందమూరి) సుహాసినిని పోటీకి నిలబెట్టిన ఉదంతం ఎన్టీఆర్ ను కాస్త ఇబ్బందికి గురిచేసింది. అందుకే ఆయన ప్రచారానికి కూడా వెళ్లలేదు. మరి ఈ నేపథ్యంలో పిలుస్తారా? పిలవరా? అన్నది చూడాలి. ఇదిలా వుంటే, ఎన్టీఆర్ ను పిలిస్తే, అతగాడు వెళ్తే మాత్రం ఫంక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. అది మాత్రం గ్యారంటీ. అక్కడకు వచ్చిన వారి అందరి కళ్లు తారక్ పైనే వుంటాయి. తాత పోలికలతో వున్న ఎన్టీఆర్ కు అంతటి క్రేజ్ వుంది మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: