చంద్రబాబునాయుడుకు వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పేట్లు లేదు. ఎందుకంటే, బాధితులందరూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏకమవుతున్నారు. షెడ్యూల్ ఎన్నికలు ఇంకా ఆరు మాసాలుండగానే తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలైపోయింది. తమను దారుణంగా మోసం చేసిన చంద్రబాబుకు ఎట్టి పరిస్ధితుల్లోను ఓట్లు వేయొద్దంటూ బాధితులు ప్రచారం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ బాధితులు ఎవరంటే నిరుద్యోగులు, అగ్రిగోల్డ్ బాధితులు. పోయిన ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు చంద్రబాబు చాలా హామీలే ఇచ్చారు. ఇంటికో ఉద్యోగమన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ 2 వేలు భృతి ఇస్తామని చెప్పారు. చంద్రబాబు మాటలు నమ్మిన నిరుద్యోగులు, యువతలో మెజారిటీ టిడిపికి ఓట్లేశారు. తీరా చూస్తే ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసినట్లుగా వ్యవహరించారు చంద్రబాబు.

 

నిరుద్యోగులు ఎంతగా మొత్తుకున్నా ఉద్యోగాల భర్తీ చేయలేదు. పోనీ నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటే అదీలేదు. అదే సమయంలో ఖాళీగా ఉన్న వేలాది టీచర్ పోస్టుల భర్తీకి ఎప్పటికప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల అని ప్రకటించటం మళ్ళీ వాయిదాలేయటం. మొత్తానికి మాయమాటలతో పై వర్గాలను మోసం చేసిన చంద్రబాబు చిరవకు ఎన్నికలు దగ్గరకు వస్తున్న కారణంగా నిరుద్యోగ భృతి అని, డిఎస్సీ ప్రకటనంటూ హడావుడి చేస్తున్నారు.

 

వీళ్ళకు తోడుగా అగ్రిగోల్డ్ బాధితులు కూడా కలిశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ వ్యవహారం బయటపడిం. బాధితులను తాము ఆదుకుంటామని మాటలు చెబుతూనే మూడేళ్ళు నెట్టుకొచ్చేశారు. ఇంత వరకూ ఒక్క బాధితునికి కూడా న్యాయం జరగలేదు. బాధితులు కొన్ని వందలసార్లు చంద్రబాబును కలిసుంటారు. అయినా ఉపయోగం కనబడలేదు. బాధితులు చంద్రబాబును ఎప్పుడు కలిసినా పెద్ద గొడవే అవుతోంది. అసలు అగ్రిగోల్డ్ సంస్దకున్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులను  అధికార పార్టీ నేతలే కొట్టేస్తున్నారన్న ఆరోపణలకు కొదవే లేదు.

 

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న చంద్రబాబు ఇంకా బాధితులను మాటలు చెప్పే మాయ చేస్తున్నారు. దాంతో బాధితులందరికీ బాగా మండింది. ఇక చంద్రబాబును నమ్ముకుంటె లాభం లేదని అనుకున్నట్లున్నారు. అందుకే బాధితులు ఎవరి పరిధిలో వారు తమ నియోజకవర్గాల్లో చంద్రబాబు వ్యతిరేక క్యాంపెయిన్ మొదలుపెట్టేశారు. ఎట్టి పరిస్ధితుల్లోను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి, చంద్రబాబుకు ఓట్లేయొద్దంటూ ఇల్లిల్లు తిరిగుతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారో తెలీదు కాబట్టి తమ సమస్య పరిష్కారినికి ఎవరైతే స్పష్టమైన హమీ ఇస్తారో వాళ్ళకే ఓట్లేయమంటూ ప్రచారం చేస్తున్నారు.

 

రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య సుమారుగా 32 లక్షలుంటుంది. వారంతా కూడా చంద్రబాబు వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. ఇక అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య మొత్తం మీద 32 లక్షలు. ఏపిలో బాధితులే సుమారు 19 లక్షలుంటారు. నిరుద్యోగులు, అగ్రిగోల్డ్ బాధితులు కలిపి సుమారుగా 50 లక్షలమంది. అంటే మొత్తం ఓట్లలో నాలుగో వంతు. ఇన్ని లక్షల మంది ఒక్కసారిగా తెలుగుదేశంపార్టీ వ్యతిరేక క్యాంపెయిన్ మొదలుపెడితే తట్టుకోవటం చంద్రబాబు వల్ల అవుతుందా ? ఏమో చూద్దాం చంద్రబాబు ఏం మాయ చేస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: