రాజకీయాల్లో కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. రాజకీయాల్లో శాశ్వత శతృవులు ఉండరు. అలాగే శతృవుకి శతృవు మిత్రుడయిపోతారు. సిద్ధాంతాలతో పని ఉండదు. ప్రాంతీయ బేధాలుండవు.. ఎక్కడివారైనా సరే తమ రాజకీయ ప్రత్యర్థికి ప్రత్యర్థి అయితే తమకు మితృడైపోతారు. తాజా ఎన్నికల్లో ఇలాంటి సంఘటన ఒకటి తెలుగుదేశం పార్టీకి వరంలా మారింది. దీన్నే వచ్చే ఎన్నికల్లో అస్త్రంగా ఉపయోగించాలనుకుంటున్నారు చంద్రబాబు.

Image result for trs ycp janasena

తాజా ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించాలని చాలా రకాలుగా ప్రయత్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒకప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేద్దామని చెప్పిన చంద్రబాబు.. కేసీఆర్ అంగీకరించకపోవడంతో వెళ్లి కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కాంగ్రెస్ సహా పలు పార్టీలతో చేతులు కలిపి ప్రజాకూటమి కట్టారు. పోటీ చేశారు.. ఘోరంగా ఓడిపోయారు. కూటమి ఓడిపోవడంతో టీఆర్ఎస్ సంబరాలు చేసుకుంది. అయితే టీడీపీ ఓడిపోయినందుకు ఏపీలో మరికొన్ని పార్టీలు పండగ చేసుకున్నాయి. అలాంటివాటిలో వైసీపీ, జనసేన ఉన్నాయి.

Image result for ycp celebrates trs win

తెలంగాణలో టీఆర్ఎస్ గెలవడంతో వైసీపీ, జనసేన సంబరాలు చేసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. ఆంధ్రరాష్ట్ర విభజనకు కారణమైన పార్టీ గెలిస్తే సంబరాలు చేసుకుంటారా.. అని ప్రశ్నిస్తోంది. వైసీపీ, జనసేనల వెనుక బీజేపీ ఉందని ఆరోపిస్తోన్న టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా వాటికి జతకావడంతో అస్సలు తట్టుకోలేకపోతోంది. ఈ మూడు పార్టీల వెనుక మోదీ ఉన్నారని, కేంద్రం చెప్పినట్లే వీళ్లు నడుచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజా సంబరాలతో టీఆర్ఎస్, వైసీపీ, జనసేన ఒక్కటేనని తేలిపోయాయని పసుపుదళం పేర్కొంటోంది.

Image result for trs ycp janasena

ఇప్పుడు ఇదే అంశాన్ని జనాల్లోకి గట్టిగా తీసుకెళ్లాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. తాజా ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడం ద్వారా అక్కడ టీఆర్ఎస్ భారీగా లబ్దిపొందింది. మళ్లీ తెలంగాణను ఆంధ్రోళ్ల చేతిలో పెడదామా.. అంటూ కేసీఆర్ సెంటిమెంట్ రగిల్చి సక్సెస్ అయ్యారు. చంద్రబాబు ప్రచారం వల్లే చివరిరోజుల్లో ఓటరు టర్న్ అయ్యాడనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పుడు ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని ఏపీలో లబ్దిపొందాలనుకుంటోంది టీడీపీ. రాష్ట్ర విభజనకు కారణమైన టీఆర్ఎస్ తో వైసీపీ, జనసేన కలిసి పనిచేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ సెంటిమెంట్ జనాల్లో రగల్చగలిగితే మళ్లీ తమదే అధికారమని నమ్ముతున్నారు. మరి టీడీపీ ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: