జాతీయస్ధాయిలో చక్రం తిప్పేంత సీన్ చంద్రబాబునాయుడుకు లేదని కెటియార్ తీసిపడేశారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు జాతీయ స్దాయి నేత కాదని తేల్చేశారు. జాతీయస్ధాయి పార్టీలను, జాతీయ పార్టీల అధినేతలను సమన్వయం చేసేంత సీన్ చంద్రబాబుకు లేదన్నారు.  బిజెపిని బూచిగా చూపించి తెలుగుదేశంపార్టీని బలోపేతం చేసుకోవలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనబడుతోందంటూ మండిపడ్డారు.

Image result for ktr

ఏపిలో బలమైన ప్రతిపక్షమే గెలవాలన్నారు. అంటే దాని అర్ధం అందరికీ తెలిసిందే. ఏపి రాజకీయాల్లో తమ పాత్ర కచ్చితంగా ఉంటుందన్నారు. అయితే ఏ రూపంలో ఉంటుందో మాత్రం చెప్పలేదు. చంద్రబాబు దృష్టిలో దేశమంటే తెలుగుదేశంపార్టీ మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దృష్టిలో దేశమంటే టిడిపి మాత్రమే అని, కానీ తమ దృష్టిలో మాత్రం దేశమంటే భారత దేశమన్నారు.

 Image result for ktr

చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్ వైపుండగా తాము మాత్రం కాంగ్రెస్, బిజెపిలకు సంబంధం లేని ఫ్రంట్ లో ఉన్నట్లు స్పష్టం చేశారు. కానీ జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయటానికి కెసియార్ ప్రయత్నిస్తున్నట్లు కెటియార్ చెప్పటం విచిత్రంగా ఉంది. కెసియార్ ను మిగిలిన ప్రాంతీయ పార్టీల అధినేతలు ఏ మేరకు నమ్మేది అనుమానమే. ఎందుకంటే, కెసియార్ అంత నమ్మదగ్గ వ్యక్తి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి బిజెపి అన్నారు. మరోసారి కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు. ఒక కూటమిలో ఉంటూనే మరో కూటమిలోకి జంప్ చేసేసిన చరిత్ర కెసియార్ ది.

 Image result for ktr

పైగా ప్రాంతీయ పార్టీల అధినేతలు అంటే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి లాంటి వాళ్ళు కెసియార్ కన్నా బాగా సీనియర్లు. వాళ్ళని కంట్రోల్ చేయటం ఒకపట్టాన అయ్యే పనికాదు. వాళ్ళు కూడా కెసియార్ మనస్తత్వం లాంటి వాళ్ళే. ఎప్పుడెవరితో ఉంటారో కూడా తెలీదు. గతంలో మమతబెనర్జీతో కెసియార్ సమావేశమైనా పెద్దగా సాధించింది లేదు.

Image result for ktr

కాబట్టి భవిష్యత్తులో కూడా కెసియార్ వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని కూడా అనుకునేందుకు లేదు. ఏదో ఒక జాతీయ పార్టీ అండ లేకుండా జాతీయ రాజకీయాల్లో మనుగడ అంత ఈజీ కాదు. ఏదో రెండోసారి అదృష్టం కొద్దీ గెలవగానే కెసియార్ చాలా పెద్ద విషయాలే మాట్లాడుతున్నారు. మరి కెసియార్ మాటలకు ఇతర రాష్ట్రాల్లోని మిగిలిన సీనియర్ నేతలు ఏ మాత్రం సహకరిస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: