తెలంగాణాలో ఎన్నికలై పోయాయి. ప్రభుత్వం ఏర్పాటైంది. కాని పరాజయం పాలైన విపక్షాలు కనీసం శాసనసభ లో ప్రతిపక్షంగా వ్యవహరించటానికి తగినంత బలం కూడా పొందలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికి వారు తమ వైఫల్యానికి కారణాలను బేరీజు వేసుకుంటున్నాయి. అందులోను ఆత్మ స్తుతి పరనింద తప్పట్లేదు. ఆ స్వభావం నుండి వారు బయల్పడే సూచనలే కనిపించట్లేదు. 

Image result for somu veerraju bjp

తెలంగాణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హీరో అయితే - ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం జీరో అయ్యార ని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవ చేశారు. ఆయన తెలంగాణ ఎన్నికల్లో ఏం?  సాధించారో ఏపీలో కూడా అదే సాధిస్తారని రాజమండ్రిలో రాజకీయ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో తమ ధారుణ వైఫల్యన్ని ఫలితాలపై బీజేపీ విశ్లేషణ చేసుకుంటుందని తెలిపారు. మధ్యప్రదేశ్ లో అరశాతం ఓట్ల తో బీజేపీ 25సీట్లు కోల్పోయిందని తెలిపారు.

 Image result for The Strongest King Vs unrest as per Chanakya

దేశంలో మంచి పరిపాలన  ఉన్నప్పుడు  ఆరాచక శక్తులు ఏకీకృతమౌతాయన్నది చాణుక్యుడి రాజనీతి చెపుతుందని అని ఆరోపించారు.

 Image result for narendra modi Vs Chanakya

నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అవుతారనే భయంతో బీజేపీకి వ్యతిరేక శక్తుల ఐఖ్య కూటమి ఏర్పడుతోందని వెల్లడించారు. ఏపీ లో 2019ఎన్నికల్లో బిజెపి అన్నిచోట్లా పోటీ చేస్తుందని తెలిపారు. ఈసారి తెలంగాణాలో మా బలహీనతలను అధిగమించి ఎక్కువ సీట్లు సాధిస్తామని వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: