చంద్రబాబు సర్కారు వచ్చాక బ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ ను ఛైర్మన్ గా నియమించారు. ఇంతకు ముందు ఇలాంటి ఏర్పాటు బ్రాహ్మణుల కోసం లేదు. అయితే ఇదంతా బ్రాహ్మణులను మభ్య పెట్టడానికే తప్ప ఆయనకు ఆ సామాజిక వర్గం పట్ల సదభిప్రాయంలేదంటున్నారు కొందరు నేతలు.



చంద్రబాబు బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేస్తూ, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రాజకీయ రంగు పులమడానికి చూస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రమణ దీక్షితులు, ఐవైఆర్‌ కృష్ణారావు విషయంలో చంద్రబాబు వైఖరి బ్రాహ్మణులంటే చులకన అని తేలిపోయిందన్నారు.

YSRC officials addressing the press conference


బ్రాహ్మణులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా కళ్లు తెరవాలని, దేవుళ్లతో సమానంగా భావించే వారిని గౌరవించే సంప్రదాయం నేర్చుకోవాలని రఘుపతి సూచించారు. కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని కోన రఘుపతి డిమాండ్‌ చేశారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 33వ సవరణ చేసి 76వ జీఓ తీసుకువచ్చారన్నారు. జీఓ నంబర్‌ 76లో అభ్యంతరాలు ఉన్నాయంటూ చంద్రబాబు దాన్ని తొక్కిపెట్టాడన్నారు.

Image result for chandrababu and brahmins


దేవాదాయ శాఖ కూడా అవసరాల కోసం వంశ పారంపర్యంగా వస్తున్న అర్చకులను రిటైర్డ్‌మెంట్‌ లేకుండా వారి శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవ చేసుకునేలా చూడాలన్నారు. బ్రాహ్మణులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని కోన రఘుపతి భరోసా ఇచ్చారు. జరుగుతున్న అన్యాయాలపై నిలదీయడం, పోరాడే తత్వాన్ని నేర్చుకుందామని, అర్చకులకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: