తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఒక్క కాంగ్రెస్ కే కాదు . ఆంధ్ర ఆక్టోపస్ అయిన లగటిపాటి కూడా షాక్ ను తెప్పించాయి . అయితే మహాకూటమి 55 నుంచి 75 సీట్లు గెలుచుకుంటుందని, తెరాస 25 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుందని తన ఎగ్జిట్ పోల్ సర్వేలో లగడపాటి చెప్పారు. కానీ తెరాస ఏకంగా 88 సీట్లు గెలుచుకుంది. మహాకూటమి కేవలం 21 సీట్లలో గెలిచింది. దీంతో లగడపాటిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా లగడపాటి రాజగోపాల్ స్పందించారు. ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 

 లగడపాటి సర్వేపై కేటీఆర్

ఈ సందర్బంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు లగడపాటి రాజగోపాల్ నిరాకరించారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తన సర్వేపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలపై దాటవేత ధోరణి అవలంభించారు. రాజకీయాల గురించి తిరుపతిలో మాట్లాడకూడదని అనుకుంటూనే మొన్న మాట్లాడేశానని చెప్పారు. అదే పెద్ద పొరపాటు అయిందని లగడపాటి చెప్పారు. నిజానికి తిరుపతిలో తాను ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు. కానీ మొన్న మీ అందరినీ చూసి ఆగలేక మాట్లాడేశానని చెప్పారు. ఆ రోజు మాట్లాడడమే పొరపాటు అయిందని తెలిలారు. మళ్లీ ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించి మరో పొరపాటు చేయబోనని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

లగడపాటి రాజగోపా నిరాకరణ

కాగా, తెలంగాణ ఎన్నికలపై ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వే అట్టర్ ప్లాప్ కావడంపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఒక వ్యక్తి చేసిన సర్వేను కొందరు ఓవర్ హైప్ చేసి చూపించారని, కానీ ప్రజలు మాత్రం నమ్మలేదన్నారు. లగడపాటి క్రెడిబులిటీ మొత్తం పడిపోయిందన్నారు. తమకు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు. లగడపాటి గతంలో తమ వల్లే రాజకీయ సన్యాసం తీసుకున్నారని, ఇప్పుడు సర్వేలు చేయకుండా సన్యాసం తీసుకున్నారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన చిరస్మరణీయ విజయాన్ని ఎప్పుడూ మరిచిపోలేరని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: