ఏపీలో తెలుగుదేశం పార్టీకి బలమైన మీడియా సహకారం దండీగా ఉంది. దాంతో ఆ నాయకులు ఏ మాట మాట్లాడినా జనాలక్ అది  క్షణాల‌లో చేరిపోతుంది. ఒకటికి  పది మార్లు అదే మాట అంటే అది వారి మనసులలో స్థిరపడిపోతుంది. ఇది ఓ విధంగా మైండ్ గేమ్ . దాంట్లో ఆరితేరిన పసుపు దళం వచ్చే ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకుని కొత్త ప్లాన్లతో ముందుకు వస్తోంది.


జగన్ కే అంటగట్టేస్తున్నారు :


2014 ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన ప్రచారం అందరికీ  గుర్తుండే ఉంటుంది. జగన్ ది పిల్ల కాంగ్రెస్, సొనియా గాంధీది తల్లి కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు కలసి అడ్డగోలుగా ఏపీని విడగొట్టాయని, ఇపుడు ఎన్నికల్లొ  విడిగా పోటీ చేస్తూ జనాలను మోసం చేస్తున్నాయని చంద్రబాబు నుంచి అంతా చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్యన బీజేపీతో విడిపోయిన తరువాత ఇదే చంద్రబాబు అండ్ కో మోడీతో జగన్ కి లింకులు పెడుతున్నారు. జగన్ బీజేపీ కలసిపోయారని చెప్పి కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలిపి మరీ ఓఅ రేంజిలో ప్రచారం చేస్తోంది. 


ఇది చాలదన్నట్లుగా ఇపుడు కొత్తగా టీయారెస్ తోనూ బంధాలు పెడుతోంది. అలాగే మజ్లిస్ పార్టీతోనూ దోస్తీ కలుపుతోంది సరే ఇవన్నీ బాగానే ఉందనుకున్న లాజిక్కుని మాత్రం తమ్ముళ్ళు ఇక్కడే విస్మరిస్తున్నారు. బీజేపీకి మజ్లిస్ కి అసలు పడదు, మరి జగన్ బీజేపీ తో ఉంటే మజ్లిస్ తో దోస్తీ ఎలా సాధ్యం అవుతుంది. ఇక టీయారెస్ విషయాన్నే తీసుకుంటే కేసీయార్ గెలిచాక చంద్రబాబు కూడా అయన్ని  అభినందించారు. వైసీపీ వాళ్ళు కాస్త ముందుకెళ్ళి సంబరాలు చేసుకున్నారు. అంటే ఇక్కడ బాబు ఓడిపోయినందుకు తాము పండుగ చేసుకున్నామని వారు చెబుతున్నారు కూడా. అయినా సరే కేసీయార్ తో జగన్ని జత చేస్తున్నారు. 


ఇక్కడొకటి చెప్పాలి. ఇదే కేసీయర్ తో పొత్తుల కోసం టీడీపీ ప్రయత్నం చేసింది. ఈ సంగతిని కేటేయర్ తో పాటు, సర్వేశ్వరుడు లగడపాటి రాజగోపాల్ కూడా ఈ మధ్యనే చెప్పారు. అంటే టీడీపీ టీయారెస్ కలిస్తే అపుడు కేసీయార్ మంచివారేనా. సోనియాతో టీడీపీ దోస్తీ చేస్తే తల్లి కాంగ్రెస్ పిల్ల టీడీపీ అవదా. ఇలా విచిత్ర వాదనలు చేస్తూ ఓవరైపోవడం వల్లనే టీడెపీ పరువు పోగొట్టుకుంటోందని అంటున్నారు. అయినా ఈ లింకుల పంట్ల వైసీపీ జగన్ ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే 2014 నాటి ప్రచారం తెచ్చిన చేటు మళ్ళీ జరుగుతుందని కూడా ఆ పార్టీ హితైషులు హెచ్చరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: