జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ దూసుకు పోతున్నాడు . అయితే చంద్ర బాబు కు  రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఈ ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు కవరింగ్ మొదలుపెట్టారు. బీద అరుపులు ప్రారంభించారు. ఇప్పుడీ 'రిటర్న్ గిఫ్ట్' అంశంపై వైఎస్ఆర్సీ అధినేత జగన్ కూడా స్పందించారు. రిటర్న్ గిఫ్ట్ అంటే ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని బాబును డిమాండ్ చేశారు.

Image result for jagan

"చంద్రబాబుకు బుద్ధి చెప్పడం కోసం టీఆర్ఎస్ నేతలు ఆంధ్రప్రదేశ్ కు వస్తామని ప్రకటించారు. వాళ్లు ఇలా ప్రకటించిన వెంటనే ఊసరవెల్లి కంటే స్పీడుగా చంద్రబాబు రంగులు మార్చారు. ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించింది, అలాంటి పార్టీ ఏపీకి రావడం ఏంటి, ప్రతిపక్షంతో కలిసి పనిచేయడం ఏంటి అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. నిజంగా ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ అడ్డుకుందని చంద్రబాబు భావిస్తే, అదే టీఆర్ఎస్ తో పొత్తు కోసం హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా చంద్రబాబు ఎందుకు ప్రయత్నించారు?

Image result for jagan

ఇలా చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు జగన్. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. చంద్రబాబు రెండు నాల్కల ధోరణిని ఎండగట్టారు. ఒకప్పుడు టీఆర్ఎస్ ను తిట్టిన చంద్రబాబు, తెలంగాణ ఎన్నికల కోసం అదే పార్టీతో పొత్తు కోసం అర్రులుచాచారని విమర్శించారు. ధర్మపోరాట దీక్షలంటూ ప్రతి కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుల్ని తిట్టావ్. పనిలోపనిగా నరేంద్ర మోడీని కూడా తిట్టావు. ఇప్పుడు అదే టీఆర్ఎస్ తో పొత్తు కోసం ఎందుకు ఉర్రూతలూగుతున్నావు. ఈ పెద్దమనిషి బీజేపీతో కలిస్తే బీజేపీ మంచిది. కాంగ్రెస్ తో కలిస్తే కాంగ్రెస్ మంచిది. ఈ చంద్రబాబు మురికి కాలువలో దూకితే అదే గంగానది అని చెబుతాడు. ఆ స్థాయిలో చంద్రబాబు రాజకీయాల్ని బ్రష్టు పట్టించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: