ముద్రగడ వైసీపీ నాయకులతో టచ్ లోకి వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే తెలంగాణ ఎన్నికలో టీడీపీ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూడటం తో ముద్రగడ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే .  తెలంగాణాలో చంద్రబాబును తెలంగాణా ప్రజలతో పాటు సీమాంధ్రులు కూడా ఛీ కొట్టినట్టుగా ఘోర ఓటమి కట్టబెట్టిన వెంటనే చెప్పుతో కొట్టినట్టుగా బాబుకు సమాధానం చెప్పారు. ...హ్యాట్సాఫ్ అని రియాక్ట్ అయ్యారు ముద్రగడ. చంద్రబాబుపై ఆ స్థాయిలో రియాక్ట్ అవుతారని వైకాపా నేతలు కూడా ఊహించలేదు. ఇక టిడిపి నేతలైతే షాక్‌కి గురయ్యారు. చంద్రబాబు టైం అస్సలు బాగాలేనట్టుందని ఫీలయ్యారు.

Image result for mudragada padmanabham photos

ఇప్పటికే తెలంగాణాలో ఘోర ఓటమి, సీమాంధ్ర ఓటర్లు కూడా బాబును చీ కొట్టడడంతో పూర్తిగా భయపడేస్థాయికి వచ్చేశాడు. ఇప్పుడు పవన్‌కి కూడా సూపర్ షాక్ తగలబోతోంది. కాపు రిజర్వేషన్స్ ఉద్యమంతో సూపర్ పాపులర్ అయిన ముద్రగడ ఇప్పుడు వైకాపా దిశగా అడుగులేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. తెలంగాణా ఫలితాల తర్వాత చంద్రబాబుపై ఓ స్థాయిలో రెచ్చిపోయి విమర్శలు చేశారు ముద్రగడ పద్మనాభం. ఆ వెంటనే కొంతమంది వైకాపా నేతలకు టచ్‌లోకి వచ్చారట. తెలంగాణా ప్రజలు చంద్రబాబుకు చెప్పుతో కొట్టినట్టుగా ఓడించారన్న ముద్రగడ ఇక టిడిపిలోకి వెళ్ళే ఛాన్సేలేదు.

Image result for jagan

జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సేలేదు కాబట్టి పవన్‌తో కూడా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. అయితే జగన్‌తో మీటింగ్ కోసం ముద్రగడ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. జగన్‌ని కలవడానికి విజయసాయితో టచ్‌లోకి వెళ్ళారట ముద్రగడ. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ ఒక్కరికీ మెజార్టీ రాదని, అందుకే రాష్ట్రం నుంచి 25ఎంపిలను గెల్చుకుని ప్రత్యేక హోదాతో సహా కేంద్ర వ్యవసాయ, రైల్వేశాఖ మంత్రులు ఎపి నుంచి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు జగన్. జగన్ ఐడియాలజీతో ఏకీభవిస్తున్న ముద్రగడ కూడా వైకాపాలో చేరి ఎంపిగా పోటీచేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: