త్వరలో ఆంధ్రాలో కూడా అడుగు పెడతామని ఇప్పటికే సంచలనం కామెంట్లు చేశారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కేసీఆర్ మరియు కేటీఆర్. ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెడతానని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Related image

ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీవల్లే నీ స్వార్థ రాజకీయాల వల్లే విడిపోవాల్సి వచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచాక కెసిఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు పై చేసిన విమర్శలకు కూడా టిడిపి పార్టీకి చెందిన నేతలు కెసిఆర్ కి కౌంటర్లు వేశారు.

Image result for minister farooq tdp

ఈ క్రమంలో టీడీపీ పార్టీకి బుద్ధా వెంకన్న ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..రాజకీయాల్లో సుదీర్ఘఅనుభవం ఉన్న చంద్రబాబుని కేసీఆర్ గల్లీలీడర్ అని వ్యాఖ్యానించారని.. కేసీఆర్ ఒక సిల్లీ లీడర్ అని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

Image result for kcr kcr asaduddin

ఇదే విషయంపై మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ...  కేసీఆర్, ఓవైసీ ఎక్కడి నుంచైనా పోటీచేయవచ్చన్నారు. గతంలో నంద్యాలలో పోటీ చేసిన ఓవైసీకీ ఒక్క శాతం ఓట్లు మాత్రమే సాధించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న నంద్యాలలో ఓవైసీ, కర్నూలులో కేసీఆర్ పోటీచేయవచ్చన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: